గత 70 రోజులుగా చైనా భారత్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చైనా మెల్లగా దారికొస్తోంది. కీలకమైన పాంగాంగ్ సరస్సు నుంచి చైనా బలగాలను వెనక్కు తీసుకుంటోంది. పాంగాంగ్ సో, డిస్పాంగ్ ప్రాంతాల నుంచి చైనా పూర్తిస్థాయిలో బలగాలను వెనక్కు తీసుకునే అంశం గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్ చైనా దేశాలు జూన్ నెలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి రెండేసి కిలోమీటర్ల చొప్పున వెనక్కు వెళ్లాయి. 
 
అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినా చైనాకు వరుస షాకులు మాత్రం తప్పటం లేదు. బర్మా అలియాస్ మయన్మార్ చైనాకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఒకప్పుడు మయన్మార్ చైనాకు అత్యంత మిత్ర దేశం. చైనా మయన్మార్ లో పెట్టుబడులు పెట్టి భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడి ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీంతో చైనా అక్కడ ఉగ్రవాద సంస్థలను రెచ్చగొడుతూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. 
 
దీంతో మయన్మార్ చైనాతో తెగదెంపుల దిశగా అడుగులు వేయడంతో పాటు భారత్ తో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. కొన్ని రోజుల క్రితం మయన్మార్ సైనికికాధికారి మాట్లాడుతూ చైనా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని... అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యలు చేశారు. చైనా మయన్మార్ లో సైనిక తిరుగుబాటు చేయించడానికి సిద్ధమైందని ప్రభుత్వానికి సమాచారం అందిందని అన్నారు. 
 
చైనా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాము భారత్ తోనే సంబంధాలను కొనసాగిస్తామని.... ఇందులో భాగంగా భారత్ నుంచి మౌలిక వసతుల పెట్టుబడులను ఆశిస్తున్నామని ఆయన అన్నారు. మిజోరాం నుంచి మయన్మార్ వరకు సముద్ర మార్గాల ద్వారా రవాణా జరిగేలా గతంలో జరిగిన ఒప్పందాలను అమలు చేస్తామని ఆ దేశ అధికారులు అన్నారు.  చైనా బుద్ధి తెలియడంతో మయన్మార్ ఆ దేశంతో పూర్తిగా సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: