తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను నమ్మించి మోసం చేశారని నట్టేట ముంచారని అది వైఎస్ జగన్ నైజమని విమర్శించారు. అంతేకాకుండా స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వైయస్ జగన్ సొంతం అని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడారని ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారని నోటికి ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. జగన్ ఏడాది పాలన గమనిస్తే తెలుగుదేశం పార్టీ నేతలపై కక్షసాధింపు పనులతోనే ఎక్కువ  సరిపెట్టుకోవడం జరిగిందని, గెలిపించిన ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదని ఆరోపించారు.

 

దీంతో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలామంది రాజ్యసభ ఎన్నికలలో వర్ల రామయ్య ఓడిపోవడంతో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అంటుండగా, మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతాభావంతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైయస్ జగన్ కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇస్తున్నందుకు కుళ్ళు కుంటు టీడీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

జగన్ ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వర్ల రామయ్యకు కౌంటర్లు వేశారు. ఏదిఏమైనా వర్ల రామయ్య మాటల వెనుక అంతరార్థం ఇలాంటి కరువు కాలంలో కూడా అద్భుతమైన పరిపాలన జగన్ అందించటమే టీడీపీ కి నచ్చకపోవడం అని చెప్పుకొస్తున్నారు. ప్రజలకు మాట ఇచ్చి తప్పే వాళ్ళు ఎన్నికలలో ప్రజలే  తప్పించారు అని, కానీ వైయస్ జగన్ మాట ఇచ్చి తప్పే వాడు కాదని ఏడాదిలోనే ప్రజలు తెలుసుకున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వర్ల రామయ్య ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు ఎవరు ఎలా పని చేస్తారో తెలుసు అని వచ్చే సార్వత్రిక ఎన్నికల కయ్యానికి అసలు టిడిపి ఉంటుందో లేదో ఆ పార్టీలో ఉన్న వారికే అర్థం కావటం లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: