ఇటీవల మధ్యప్రదేశ్ లో ఉజ్జయిన్ నగరంలో గ్యాంగ్ స్టార్ వికాస్ దుబే ఎన్ కౌంటర్ దేశంలోనే సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. వికాస్ దుబే మరణ వార్త విని ఆయన సన్నిహితులు దేశంలోనే అత్యంత కిరాతకుడిగా క్రూరుడుగా ఆయన్ని పేర్కొంటున్నారు. సరైన శిక్ష పడిందని ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న వికాస్ దుబే కి పోలీసులు సరైన శిక్ష విధించడం జరిగిందని అంటున్నారు. ఇలాంటి వాళ్లను ఇంకా భూమి మీద ఉంచితే వాళ్ళ చుట్టుపక్కల మనుషులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని, సామాన్యుల జీవితాలతో ఆడుకునే అవకాశం ఉందని వికాస్ దుబే ఎన్ కౌంటర్ పై చాలామంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

 

సన్నిహితులు ఇలా అంటే కుటుంబ సభ్యులు... అయితే మరీ దారుణంగా అలాంటి నరరూప రాక్షసుడు భూమి మీద బతకడానికి అర్హత లేదని ఎన్ కౌంటర్ మీద షాకింగ్ కామెంట్ చేశారు. స్వయంగా వికాస్ దుబే భార్య..చాలా దారుణమైన నేరం చేశాడు… అతడు ఈ శిక్షకు అర్హుడు అని స్పందించింది. ఇదే సందర్భంలో వికాస్ దుబే తండ్రి మాట్లాడుతూ.. ‘మా మాట వికాస్ ఎప్పుడూ వినలేదు. మా మాట వినుంటే అతడికి జీవితం ఇలా ముగిసేది కాదు. అతడి వల్ల పూర్వికుల నుంచి వస్తున్న ఆస్తి కోల్పోయాం. ఈ శిక్షకు వికాస్ అర్హుడే. వికాస్ ను ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదం. వికాస్ ను చూసి ఇలానే మిగిలినవారు వ్యవహరించే ప్రమాదం ఉంది’ అని ఆయన అన్నారు.

 

కొడుకు అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేదు. కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో వికాస్ దుబే అంత్యక్రియలు జరిగాయి. జరిగిన అంత్యక్రియలకు భార్య రీచా మరియు కుమారుడు అదేవిధంగా బావమరిది హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనని అరెస్ట్ చేయడానికి వస్తున్న ఎనిమిది మంది పోలీసులను కిరాతకంగా కాల్చి చంపడం తో దేశవ్యాప్తంగా వికాస్ దుబే పేరు మారుమోగిపోయింది. దీంతో అతడిపై యూపీ ప్రభుత్వం 5లక్షల రివార్డు కూడా పెట్టింది. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ నగరంలోని మహాకాళేశ్వరుడి ఆలయం వద్ద పట్టుకోగా మార్గంమధ్యలో తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడంతో పోలీసు కాల్పుల్లో వికాస్ దుబే చివరి శ్వాస విడిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: