దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రజలు కూడా వైరస్ పేరు వింటే గజగజా వణికిపోతున్నారు. 
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మృతదేహాల ఖననం ఘర్షణలకు దారి తీస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు మృతదేహాలకు అంత్యక్రియలు చేయడంలో గొడవలు సృష్టిస్తూ ఉండటంతో రహస్యంగా అంత్యక్రియలు చేయడం జరుగుతోంది. అయితే ప్రజలు మనిషి చనిపోయిన తరువాత చేసే కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు శవ దహనాలు చేయట్లేదనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవంగా దహనం చేస్తే సమస్యలు ఉండవు కదా...? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. 
 
అయితే శవ దహన వాటికలు శ్మశానాల్లో ఉండవు. పెద్దపెద్ద నగరాల్లోని శ్మశానాల్లో మాత్రమే ఇవి ఉంటాయి. దహనం తరువాత వచ్చే చితాభస్మం నుంచి కరోనా సోకుతుందా....? లేదా....? అనే పరిశోధనలు కూడా జరగలేదు. కరోనా రోగులకు దహనం చేసి సామాన్యంగా చనిపోయిన వారికి కూడా అంత్యక్రియలు చేస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందా...? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందువల్లే శవదహనాలు చేయడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపట్లేదు. 
 
మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో 1914 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 12,763 యాక్టివ్ కేసులు ఉండగా 13,245 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 328కు చేరింది. తెలంగాణలో గతంలో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: