కేసీఆర్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కష్టం.. ఆయన కొన్నిసార్లు చాలా వేగంగా స్ట్రాటజీలు మార్చేస్తారు.. అంత తక్కువ సమయంలో యూ టర్న్‌లు తీసుకుంటారు. కానీ కేసీఆర్ గొప్పదనం అంతా ఆయన మాటల్లోనే ఉంది. ఏం చేసినా.. జనాన్ని తన నిర్ణయం కరెక్టే అని మాటల మాయతో ఒప్పించగలరు. ఇంత టాక్ పవర్ ప్రస్తుతం తెలుగు నేలపై ఏ నాయకుడికీ లేదు. 

 


కేసీఆర్ కరోనా వచ్చిన మొదట్లో మోడీని తెగ పొగిడారు. మోడీ లాక్ డౌన్ పెట్టినప్పుడు.. చప్పట్లు కొట్టమన్నప్పుడు... దీపాలు వెలిగించమన్నప్పుడు కేసీఆర్ మోడీని బాగా పొగిడారు. ఆయన మన ప్రధాని అంటూ వెనకేసుకొచ్చారు. మోడిని విమర్శించిన వాళ్లను తమ మాటలతో ఏకేశారు. అయితే మళ్లీ కొద్ది నెలల్లోనే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని తిడుతున్నారు. కరోనా కట్టడికి మోడీ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. 

 

IHG


మరి ఇంతంలోనే అంత మార్పు ఎందుకంటే.. దానికీ ఓ రీజన్ ఉందట.  లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అంటూ కేసీఆర్ అప్పట్లో తనవంతుగా పలు ఉచిత సలహాలు ఇచ్చారు. ‘హెలికాప్టర్‌ మనీ’ అంటూ  కొన్ని సూచనలు చేశారు. అయితే తన సూచనను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టారు. దీంతో కేసీఆర్ కు మండుకొచ్చిందట. 

 


కేంద్రం కరెన్సీ నోట్లను ముద్రించి ఉదారంగా రాష్ర్టాలకు పంచితే ఆ డబ్బు తాను పేదలకు పంచి దేవుడనిపించుకోవాలని కేసీఆర్‌ భావించారట! ఇవేవీ జరగకపోవడంతో కేంద్రాన్ని తిట్టిపోయడం మొదలుపెట్టారట. మంత్రివర్గ సమావేశాల్లో కూడా బీజేపీని విమర్శిస్తున్నారట. ఈ విశ్లేషణ అంతా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణది. తన తాజా కొత్తపలుకులో ఈ కోణం చర్చించారు ఆర్కే. 

మరింత సమాచారం తెలుసుకోండి: