గత కొన్ని నెలలుగా చైనా భారత్ దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగిన సమయంలో భారత్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు వ్యక్తమైంది. భారత్ అడగకుండానే అగ్రరాజ్యం అమెరికా మన దేశానికి యుద్ధనౌకలను పంపింది. అయితే భారత్ ను అమెరికా బలంగా నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
అమెరికా భారతదేశాన్ని అజేయశక్తిగా చూస్తోంది. అమెరికా చైనాల మద్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో దక్షిణ చైనా సముద్రంలో అగ్ర రాజ్యం క్రియాశీలకంగా చర్యలు చేపడుతోంది. రెండు నావికాదళ విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో తాజాగా యుద్ధవిన్యాసాలు చేశాయి. అమెరికా బల ప్రదర్శన చేసేందుకే దక్షిణ చైనా సముద్రంలోకి నౌకలను పంపిస్తోంది. అమెరికా యుద్ధనౌకలను పెట్టడం భారత్ పట్ల ప్రపంచ దేశాల ధోరణి మారిందని చెప్పటానికి నిదర్శనం. 
 
అయితే చైనా తమ దేశంలోని ప్రాంతాల పట్ల చిచ్చు పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తోంది. గతంలో కూడా అమెరికా చైనా దేశాలు బల ప్రదర్శనలకు దిగాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరించిన పెంచిన నేపథ్యంలో అగ్రరాజ్యం డ్రాగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దక్షిణ చైనా సముద్రం అందరిదనీ ఆ ప్రాంతానికి ఎవరైనా రావచ్చని సందేశం ఇవ్వాలనుకుంటోంది. 
 
దక్షిణ చైనా సముద్రంపై హక్కులు ఉన్నాయని అమెరికా వాదిస్తోంది. దక్షిణ చైనా ప్రాంతం ఎవరికీ చెందదని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. గతంలో దక్షిణ భారతదేశంలో సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు భారత్ అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత్ చైనాకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. భారత్ అమెరికా కలిస్తే చైనాను దెబ్బ తీయవచ్చని భావించి అమెరికా భారత్ కు సంపూర్ణ సహకారం అందిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: