గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. కొన్ని రోజుల నుంచి ఈయన వ్యవహారంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందో లేదో తెలియదు గానీ, ఆయన మాత్రం పూర్తిగా వైఎస్సార్‌సీపీకి దూరమైపోయారన్న విషయం అర్ధమైపోయింది. 

 

రఘు బీజేపీ మనిషిగా మారిపోయారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఒకవేళ వేటు పడకపోతే ఆయన బీజేపీ ఎంపీగానే నడుచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం పక్కనపెడితే, నెక్స్ట్ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ బరిలో దిగే వైసీపీ అభ్యర్ధి ఎవరని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. రఘు సైడ్ అయ్యారు కాబట్టి, ఆయన స్థానంలో జగన్ ఏ నాయకుడుని దించుతారు అని కార్యకర్తలు ఆతృతగా ఉన్నారు.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు నరసాపురం పార్లమెంట్ సీటు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలో దిగి రఘు గట్టి పోటీ ఇచ్చిన వేటుకూరి శివరామరాజుని వైసీపీలోకి తీసుకొస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఉండి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజుకు వెస్ట్‌లో మంచి పట్టుంది. మంచి పేరు కూడా ఉంది. కాబట్టి ఆయన్ని వైసీపీలోకి తీసుకొచ్చి నరసాపురం సీటు ఇస్తే తిరుగుండదని అనుకుంటున్నారు.

 

ఇక రఘురామకృష్ణంరాజు బీజేపీ మనిషి అయ్యారు కాబట్టి, ఆయన ఆ పార్టీ నుంచి బరిలో ఉండొచ్చని తెలుస్తోంది.  జనసేనతో ఎలాగో బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ-జనసేన పొత్తులో దిగిన రఘు విజయం సాధ్యం కాదు. అలా కాకుండా టీడీపీతో పొత్తు ఉంటే రఘు విజయానికి తిరుగుండదు. ఒకవేళ బీజేపీ-జనసేనలతో టీడీపీ పొత్తు లేకపోతే రఘు పోలిటికల్ కెరీర్ ఎండ్ అయినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: