అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాపై ఆశ‌లు పెట్టుకున్న వారికి ఇంకా త‌న‌దైన శైలిలో నిరాశ‌లు, షాకులు కొన‌సాగిస్తున్నారు.  చిన్నతనంలోనే అమెరికాకు వచ్చి స్థిరపడిన యువత దేశంలో చట్టప్రకారం నివసించేందుకు  ‘డిఫరెంట్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌' (డీఏసీఏ) చట్టం అనుమతిస్తుంది. 2012లో బరాక్‌ ఒబామా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలో 6.5 లక్షల మంది యువత చట్టబద్దంగా జీవిస్తున్నారు. వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టే చర్యల్లో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. ఈ విష‌యంలో అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ‘డిఫరెంట్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌' (డీఏసీఏ) చట్టాన్ని రద్దుచేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

 

అయితే, ట్రంప్ మ‌రో రూట్లో వ‌స్తున్నారు. అమెరికాలోకి ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా చిన్నతనంలోనే వెళ్లి స్థిరపడిన విదేశీయులను వెళ్లగొట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఆస్ర్తాన్ని ప్రయోగించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేప‌థ్యంలో ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేయనున్నట్టు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్వయంగా చెప్పారు.

 

డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) చట్టాన్ని బరాక్‌ ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు డీఏసీఏ చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులతోపాటు వెళ్లిన వారి పిల్లలకు ఆ దేశంలో స్వేచ్ఛగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం లభించింది. అలా వెళ్లినవారు ప్రస్తుతం 7లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు, ఆసియా దేశాలవారే ఉన్నారు. వీరంద‌రికి ట్రంప్ తిక్క నిర్ణ‌యం షాక్ ఇవ్వ‌నుంది. వారి జీవితాల‌ను రోడ్డున ప‌డేయ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: