దేశమంతా కరోనా గురించి కలత చెందుతుంటే మన ఏపీలో మాత్రం రాజకీయ రచ్చ రగులుతూనే ఉంది. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చతురులు సర్వసాధారణమే. కానీ ఆంధ్రలో మాత్రం ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2014లో అధికార పార్టీగా హవా కొనసాగించిన టీడీపీ...వైఎస్సార్‌సీపీ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది.

 

ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ-టీడీపీలకు సీట్లు ఎలా వచ్చాయో తెలిసిందే. అలాగే వైఎస్సార్‌సీపీకి 51 శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40 శాతం ఓట్లు వరకు వచ్చాయి. ఇక జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒకశాతం ఓట్లు కూడా రాలేదు. రెండు పార్టీలకు నోటాకి కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో బీజేపీ ఏ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలనీ చేర్చుకుని హడావిడి చేస్తోంది.

 

అసలు కేంద్రంలో తమ హవా కొనసాగిస్తున్న బీజేపీకి రాష్ట్రంలో ఎంతమాత్రం ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో తన బలమెంతో తెలిసి కూడా బీజేపీ భూమి ఆగడం లేదు. అసలు టీడీపీని ప్రతిపక్షం కిందే లెక్క చేయడం లేదు. ఇక అధికార వైఎస్సార్‌సీపీకి తామే ప్రధాన ప్రత్యర్ధులు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా చేతకాని తెలుగుదేశం ప్రతిపక్ష పాత్రకి కూడా పనికిరాదంటూ రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

ఇక బీజేపీ వేసే ప్రతి సెటైర్లకు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడంలో తెలుగు తమ్ముళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. "నోటాకి వచ్చిన ఓట్లు కూడా రాని మీరు(బీజేపీ) ప్రధాన ప్రతిపక్షం అయితే నోటా అధికార పక్షమా" అంటూ బీజేపీపై కౌంటర్లు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తిప్పితిప్పి కొడితే రాలిన ఒకశాతం లోపు ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాలవనీ... మళ్ళీ నోటానే మీ కంటే ముందుంటుందని కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: