మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆరేళ్ళుగా అజేయంగా పాలిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కీర్తిని అందుకున్నారు. ఇక జగన్ యువ ముఖ్యమంత్రి. ఏడాదిగా తనదైన పాలన చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. కొన్ని సార్లు జగన్ జాతీయ స్థాయిలో కూడా చర్చకు వస్తున్నారు. ఆయన ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో చేపట్టిన చర్యలకు మంచి ఫలితాలు వస్తూండడంతో జాతీయ మీడియా బాగా ఎత్తేస్తోంది.

 

ఇవన్నీ ఇలా ఉండగా ఏపీ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజువైసీపీకి  కంట్లో నలుసుగా మారారు. వైసీపీ అధినాయకత్వాన్ని ఆయన నిలదీస్తున్నారు. విపక్షం కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఆయన మీద వైసీపీ గుర్రుగా ఉంది. జగన్ ఆదేశాల మేరకు  పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీ వెళ్ళి లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. రాజు గారి మీద అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. 

 

దీని మీద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా ఉన్నట్లుగా వైసీపీ ఎంపీలు చెప్పుకున్నా కూడా బీజేపీకి చెందిన ఓం బిర్లాపార్టీ పెద్దల ఆలోచనను  కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నది వాస్తవం. ఇక రాజుగారు అయితే మోడీని ఒక్క లెక్కన ఎత్తేస్తున్నారు. తన మీద అనర్హత వేటు పడదంటూ ధీమాగా ఉన్నారు.

 

మరి ఇక్కడే జగన్ పలుకుబడి, బీజేపీలో ఆయనకు ఉన్న బంధం ఏంటన్నది తేలుతుంది అంటున్నారు. జగన్ పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటిదాకా బాగానే ఉంటూ వస్తోంది. ఇక జగన్ సైతం బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ఇగో హర్ట్ చేసిన రాజు గారి మీద వేటు వేయడం  వైసీపీకి అత్యవసరం.

 

మరి ఈ విషయంలో బీజేపీ పెద్దలు డిఫర్ అయితే మాత్రం జగన్ కూడా దూరం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జగన్ అవసరం బీజేపీకి చాలా ఉందని అంటున్నారు. రాజ్యసభలో వరసగా బిల్లులు పెడితే వైసీపీ నుంచి మద్దతు కావాలి. అలాగే మరో రెండేళ్లలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు కీలకం అవుతుంది. అదే విధంగా 2024లో మరోమారు అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటోంది. ఆ పార్టీకి ఏ మాత్రం సీట్లు తగ్గినా జగనే మిత్రుడిగా మారాల్సివుంటుంది. దీంతో జగన్ విషయంలో బీజేపీ వ్యతిరేకంగా ఉండదని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. మరి రాజు గారి సాక్షిగా  ఈ రెండు పార్టీల బంధం ఏంటో తేలనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: