ప్రపంచంలోని వెనుకబడిన దేశాలలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత కొన్నేళ్లుగా చైనా పెట్టుబడులు పెడుతోంది. అయితే చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ వల్ల పలు దేశాలు చైనా పెట్టిన పెట్టుబడులు ఇవ్వలేమని చెబుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దీర్ఘకాలిక ఆదాయంతో పాటు ఆ దేశాలపై ఆధిపత్యం చలాయించవచ్చని భావించింది. మరోవైపు ఇతర దేశాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సైతం చైనా పెట్టుబడులు పెట్టింది. 
 
చైనా భారత్ లో పెట్టిన పెట్టుబడుల గురించి తాజాగా గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లోని టెక్ స్టార్ట్ రంగంలో చైనా 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ పెట్టుబడులు చిన్నమొత్తం అనిపించినప్పటికీ టెక్నాలజీ రంగం ద్వారా భారత్ లో చైనా వేర్వేరు దేశాల పేర్లతో పెట్టిందని సమాచారం. ఇతర దేశాలలో చైనా సంస్థలు పెట్టి తద్వారా భారత్ లోని టెక్ రంగంలో తన ముద్ర వేయాలని డ్రాగన్ భావించింది. 
 
మార్చి 2020లో వెలువడిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో విసృతంగా ఉపయోగించబడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. అలీబాబా, బైట్ డాన్, టెన్సెంట్ వంటి దిగ్గజాలలో డ్రాగన్ పెట్టుబడులు ఉన్నాయి. చైనా భారత్ లోని 92 స్టార్టప్ లకు నిధులు చేకూర్చిందని తెలుస్తోంది. వీటిలో పేటీఎం, బైజూస్, ఓలా లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. 
 
వీటితో పాటు భారత్ లోని దిగ్గజ సంస్థలలో సైతం చైనా పెట్టుబడులు ఉన్నాయి. 2018లో చైనా 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఎంజీ మోటార్స్ లో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. చైనా ప్రత్యక్షంగా పెట్టకుండా పరోక్షంగా భారత్ లో పెట్టుబడులు పెట్టిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: