ప్రస్తుతం దేశంలో కరోనా  వైరస్ రోజురోజుకు పంజా విసురుతున్న విషయం తెలిసిందే. శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమందిని భయపెడుతుంది. ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ పై ప్రతిరోజు ఎన్నో అపోహలు ఎన్నో అనుమానాలు కూడా జనాలకు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ సోకకుండానే  మనస్తాపం చెంది మరణిస్తున్నవారు ఎక్కువ అవుతున్నారూ. అయితే ఈ మహమ్మారి వైరస్ ధనిక పేద అనే తేడా చూడటం లేదు అనే విషయం తెలిసిందే. 

 

 సామాన్య ప్రజల తో పాటు సినీ సెలబ్రిటీలు డాక్టర్ లు  పోలీసులు లాయర్లు ఇలా ప్రతి ఒక్కరికి  సోకుతూ అందరిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుసగా కరోనా  కేసులు నమోదు అవుతుండటం  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్   కూడా కరోనా  వైరస్ బారిన పడ్డారు, 

 

 దీంతో అభిమాను ల్లో ఆందోళన మొదలైంది. అయితే అభిమానులందరూ  అమితాబచ్చన్ కరోనా వైరస్ సోకిందని ఆందోళన చెందుతున్న నేపథ్యం లో... అమితాబచ్చన్ అభిమానులతో పాటు అందరిలో  ధైర్యం ఇచ్చే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను  కరోనా  వైరస్ బారిన పడిన కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని.. గత కొన్ని రోజుల నుంచి తనతో ఎంతో సన్నిహితంగా మెలిగిన వాళ్లందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచించాడు. అంతే కాకుండా అందరూ ధైర్యంగా ఉండాలని తెలిపారు అమితాబ్.  ఇలా ఎంతో మంది కరోనా  భయం తో బాధపడుతున్న వారిలో అమితాబచ్చన్ తన  మాటలతో స్ఫూర్తిని నింపారు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: