మోడీ చూడడానికి మామూలుగా కనిపిస్తారు కానీ అమ్మో ఇంత పవర్ ఉందా అని చైనా అధ్యక్షుడు  జిన్ పింగ్  ఇపుడు తాపీగా అనుకుంటున్నాడుట. అవును మరి భారత్ పర్యటనలో భాగంగా  తమిళనాడులోని మహాబలిపురం జిన్ పింగ్   వస్తే మోడీ ఎదురేగి వంగి దణ్ణం పెట్టారు. అది భారతదేశం సంస్కారం. అలాగే ఏం చేసినా భారత్ వంగి వంగి ఉంటుందని, నంగి నంగిగా ఉంటుందని చైనా అనుకోవడమే ఇక్కడ పొరపాటు.

 

ఇపుడు చైనా సంగతి మొత్తం తేల్చేసేపనిలో మోడీ పడ్డారు. శత్రువుని టచ్ చేయాలంటే ముందు చుట్టుపక్కల ఉన్న‌ బలాలను కూడా తీసేయాలి. నేపాల్ వంటి హిందూ దేశాన్ని కమ్యూనిస్ట్ దేశంగా మార్చేసి తన తాబేదారుగా చైనా చేస్తోంది. దాంతోనే రెచ్చిపోయిన నేపాల్  భారత్ లోని ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు తమ సొంతమని ధీమాగా ప్రకటించింది. అంతే కాదు మ్యాప్ కూడా మార్చేసి జోరు చేసింది.

 

దీంతో భారత్ ఎక్కడ స్విచ్ నొక్కాలో అక్కడే నొక్కింది. దాంతో నేపాలి ప్రధాని ఓలీ పదవికే ఇపుడు ఎసరు వచ్చింది. నేపాల్ ప్రధాని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ భారత్ మీద అనవసర వ్యతిరేకత పెంచుతున్నారంటూ ఆ దేశంలో నేపాలీలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.  అదే విధంగా ఓలీ పార్టీలో కూడా తిరుగుబాటు వచ్చిపడింది. ఇదంతా భారత్ కుట్రేనని ఓలీ పెడబొబ్బలు పెడుతున్నా ఇపుడు కుదిరే వ్యవహారంలా లేదు. అంతా ముదిరే వ్యవహారం అయిపోయింది.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు భారత్ తో కయ్యం పెట్టుకుని  పదవికి  సున్నం పెట్టుకున్న ఓలీ ఒళ్ళు కాలి  గోల పెడుతూంటే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కళ్ళు కొడుతున్నారుట. అంతా నీవల్లే వచ్చిందని నేపాల్ ప్రధాని ఓలీ చైనా మీద గుస్సా అవుతూంటే అమ్మో మోడీ తెలివి ఇలా దెబ్బ కొట్టరా అనుకోవడం డ్రాగన్ కంట్రీ వంతు అవుతోంది.ఇక ఇదే తీరున చుట్టుపక్కల మిగిలిన దేశాల్లో కూడా భారత్ తన పూర్వపు పరపతి పెంచుకోవడం ద్వారా చైనాకు గట్టి షాక్ ఇవ్వాలనుకుంటోంది. భారత్ చైనాలలో ఏది బెస్ట్ అంటే శ్రీలంక బంగ్లాదేశ్  సహా అనేక దేశాలు భారత్ కే ఓటు చేతాయి. మొత్తానికి భారత్ ని ఏదో చేద్దామనుకుని చైనా తానే  బొక్క బోర్లా పడుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: