భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇతర దేశాలలో ఒకే మతానికి చెందిన వారు ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం హిందూ ముస్లిం క్రిస్టియన్. ఇలా ఎన్నో  మతాలకు చెందినవారు సోదర భావంతో మెలూగుతూ  ఉంటారు. ఎవరి మతాన్ని వారు ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తూ ఉంటారు అందరూ. అయితే అటు ఎవరి మతానికి తగ్గట్లుగా వారికి ప్రత్యేక ప్రార్థనా మందిరాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపుగా ప్రభుత్వాలు ఈ ప్రార్థన మందిరాలు విషయంలో అస్సలు జోక్యం చేసుకోవు . మత పరమైన వివాదాలు తెర మీదకు వస్తాయి అన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా మతపరమైన నిర్ణయాలు  తీసుకోవు. 

 

 కానీ తాజాగా టర్కీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనంగా మారిపోయింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చర్చి ని  మసీదు గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది టర్కీ ప్రభుత్వం. దాదాపు 1500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చర్చి ఆ తర్వాత మ్యూజియంగా  ప్రస్తుతం మసిద్ గా  మారేందుకు సిద్ధమైంది. గతంలో చర్చిగా ఉన్న ఈ భవనాన్ని ప్రస్తుతం మసీదుగా మార్చాలంటూ టర్కీ  అధ్యక్షుడు ఉత్తర్వులు కూడా జారీ చేసారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పురాతన  క్రైస్తవ కేంద్రంగా ఉన్న చర్చి.. తదనంతర కాలంలో మ్యూజియం గా మారిపోయింది అన్నది చరిత్ర చెబుతుంది. అయితే చర్చి మ్యూజియం గా  మారడానికి ముందు ఈ మధ్య కాలంలో మసీద్  గా మార్చారు  అనే వాదన కూడా ఉంది. 

 


 అయితే ప్రస్తుతం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం చూడటానికి  ఎంతో మంది దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు, అలాంటి చర్చిని  ప్రస్తుతం ఉన్న టర్కీ అధ్యక్షుడు  మసీదు గా మార్చడానికి నిర్ణయం తీసుకోగ.. గతంలో  దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. కానీ  ప్రస్తుతం కోర్టు నుండి  గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇటీవలే ప్రభుత్వం ఈ పురాతన చర్చి ని  మసీదు గా మార్చేందుకు ఉత్తర్వులు  జారీ చేసింది. మరి ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: