ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న  విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య తలెత్తిన వైరం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకోవడంతో రాజస్థాన్ ప్రభుత్వం లో ప్రస్తుతం సంక్షోభం ఏర్పడే ఫస్ట్ పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు మరవకముందే  రాజస్థాన్ లో మరో నేత కూడా తిరుగుబాటు ప్రారంభించారు, దీంతో ఇది కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పాలి, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తనను ముఖ్యమంత్రిని చేస్తానని సచిన్ పైలెట్ కు హామీ ఇచ్చిన నేపథ్యంలో సచిన్ పైలెట్ ప్రస్తుతం ఇలా తిరుగుబాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 


 అయితే గత కొన్ని రోజుల నుంచి సచిన్ పైలెట్ తనతో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీ  పార్టీ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఇటీవలే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో  ఏకంగా కీలక నేత అయిన  సచిన్ పైలెట్ కు నోటీసు ఇవ్వడం మరింత సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం సచిన్ పైలెట్ తనతోపాటు 25 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారు, అయితే పార్టీని వీడకుండా.. పైలెట్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం పైలెట్ తో  చర్చలు జరుపుతోంది, ఇదే సమయంలో బిజెపి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోంది అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపణలు చేస్తున్నారు. 

 


 అయితే ప్రస్తుతం సచిన్ పైలెట్ దారి ఎటు అన్నది ఆన్ రాజస్థాన్ రాజకీయాలలో ఎంతో సంచలనంగా మారిపోయింది, ప్రస్తుతం సచిన్ పైలెట్ వెంట  25 మంది ఎమ్మెల్యేలు  ఉండడంతో పాటు ప్రస్తుతం...13 మంది  స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలెట్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరందరూ కలిసి సచిన్ పైలెట్ తో పాటు బీజేపీ లో చేరితే రాజస్థాన్లో ప్రభుత్వ కూలడం  ఖాయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో సచిన్ పైలెట్ తో సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు బిజెపి లో చేరితే... గతంలో కర్ణాటకలో చేసిన విధంగా బిజెపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందా.. లేదా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల కు ప్రోత్సహించి బీజేపీ  తమ పార్టీలోకి చేర్చుకుని కీలక పదవులను ఇస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే పైలెట్ ప్రస్తుతం బీజేపీ లో చేరుతారా..  కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: