గత వారం రోజుల నుండి కేరళ రాజధాని తిరువనంతపురంలో కఠినమైన లాక్ డౌన్ ను విధించినా కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రేపటి నుండి మరో వారం రోజుల పాటు అక్కడ పూర్తి లాక్ డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు.
 
ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 435 పాజిటివ్ కేసులు నమోదుకాగా రెండు కరోనా మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 7873 కేసులు నమోదుకాగా అందులో 4098మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 3743 కేసులు యాక్టీవ్ గా ఉండగా మొత్తం 30మంది కరోనాతో మరణించారు.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా హవా కొనసాగుతూనే వుంది. ఈరోజు కూడా దేశంలో 27000కు పైగా కరోనా కేసులు నమోదుకాగా అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 7827,తమిళనాడులో 4244 కర్ణాటకలో 2627కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా చూస్తే భారత్ లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 870000 దాటగా 23000 మందికి పైగా బాధితులు కరోనాతో మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: