ప్రస్తుతం టీడీపీ అవలంబిస్తున్న విధానాలన్ని, అవుట్ డేటెడ్ అయిపోయాయని, యువ రక్తం ఎక్కిస్తే కానీ, పార్టీలో ఉత్సాహం రాదనే అభిప్రాయాలు చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే లోకేష్ తో సరిసమానమైన వయసులో ఉన్న జగన్ సొంతంగా పార్టీ పెట్టడమే కాకుండా, దానిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంతగా కష్టపడ్డాడో చెప్పనవసరం లేదు. ఇక ఆ పార్టీలోనూ యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, జగన్ పార్టీలోనూ, జనాల్లోనూ పట్టు పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పోల్చుకుని చూస్తే, టిడిపిలో యువత ప్రాధాన్యత తక్కువగానే ఉందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఎక్కువ చంద్రబాబుతో సహా, ఎక్కువ మంది రిటైర్మెంట్ వయసు దాటి పోయిన వారే. వారితోనే పార్టీని నెట్టుకొస్తున్నారు. 

 

ఇంకా పాత తరహాలోనే వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ ఉండడం జనాలను ఆకట్టుకునే విషయంలో విఫలం అవ్వడం, తదితర కారణాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు తన రాజకీయ వారసుడు లోకేష్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించినా, మిగతా విభాగాల్లో సీనియర్ నాయకులు ఉన్నారు. త్వరలోనే పార్టీ పదవులలో మార్పు చేర్పులు చేయాలని చూస్తున్న చంద్రబాబు, ఇక ఎక్కువగా యువతకు ప్రాధాన్యం పెంచే విధంగా వారికి కీలక పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకుంటూ, నాయకులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లకపోతే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటామనే అభిప్రాయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే లోకేష్, చంద్రబాబు తరఫున పార్టీ కార్యక్రమాలు అన్నిటిలోనూ పాల్గొంటూ పరామర్శకు వెళుతూ రాష్ట్రంలో హడావుడి చేస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ కు వెన్నుదన్నుగా నిలబడేందుకు యువ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూనే, పార్టీకి మనుగడ ఉంటుందనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: