ఏపీ బిజెపి, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నా, ఆ పొత్తు వల్ల పెద్దగా ఉపయోగం లేదని, పవన్ ను బిజెపి పట్టించుకోవడంలేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో, అకస్మాత్తుగా బిజెపి, జనసేన నాయకులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నా, దానిని అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయడం లేదంటూ బిజెపి, జనసేన నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఏపీ లో నెలకొన్న సమస్యలు వంటివాటి పై ఇకపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా కలిసి పోరాటాలు, ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగానే చేస్తుండడంతో   వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని , దీని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది అంటూ రెండు పార్టీల నేతలు విమర్శలు చేశారు అలాగే వ్యాధి నివారణలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ విపత్కర సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తర్వాత దీనిపై మీడియా సమావేశాన్ని నిర్వహించాలని అభిప్రాయంతో రెండు పార్టీల నేతలు ఉన్నారు. 

అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా, నిర్మించిన ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిన 9 వేల కోట్లు అందించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక ప్రజల్లోకి వెళ్లి తేల్చుకునేందుకు, తమ పార్టీలకు ప్రజల్లో మద్దతు లభించే విధంగా బిజెపి, జనసేన  ప్లాన్ చేసుకుంటోంది

మరింత సమాచారం తెలుసుకోండి: