ప్రపంచం అభివృద్ధి చెందిన తర్వాత ఇంత భయంకరమైన రోజులను బహుశా చూసి ఉండదు.. ఒక మాయదారి రోగం లోకాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చెడుగుడు ఆడుతుంటే ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నాం.. ఇక ఈ నాటి మనిషి శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోయాడని ఇంతకాలం అనుకున్నాం.. కానీ కరోనా విషయంలో మన అభివృద్ధి ఏంటో అర్ధం అవుతుంది.. ఒక్క వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు అహర్నిశలు చేస్తున్న కృషికి ఫలితం ఇంత వరకు లభించలేదంటే ఇంకా మనం వెనకబడే ఉన్నాం అని అర్ధం..

 

 

ఇక ఏనాడైతే కరోనా అనే వైరస్ ప్రజల జీవితాల్లో ప్రవేశించిందో అప్పటి నుండి మానవ సంబంధాలు క్రమ క్రమంగా మాయం అవుతూ వస్తున్నాయి.. ఇప్పుడున్న పరిస్దితుల్లో అయితే ఈ వైరస్‌తో మరణించిన వారి పరిస్దితి ఎంతటి ఘోరాతి ఘోరంగా తయారైందో నిత్యం వార్తల్లో వస్తున్న ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.. ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానాలో జరిగింది.. ఆ వివరాలు చూస్తే..

 

 

పెద్దపల్లిలోని తెనుగువాడకు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 10న కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతకు ముందే ఇతనికి షుగర్ కూడా ఉందట.. ఈ దశలో మెడికల్ సిబ్బంది హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఈ వ్యక్తికి సూచించారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 108లో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అయితే అప్పటికే ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవడం, ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ అందించే సౌకర్యాలు లేకపోవడంతో ఈ వ్యక్తి మరణించాడు..

 

 

ఈ విషయాన్ని అధికారులు ఆ కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలియజేయగా ఎవరు స్పందించలేదట.. దీంతో మున్సిపాలిటీ వారికి సమాచారం ఇవ్వగా ఆ శవాన్ని తీసుకువెళ్లడానికి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినా సదరు డ్రైవర్ ట్రాక్టర్‌ నడిపేందుకు ఒప్పుకోలేదు. అప్పటికే అతడు మరణించి చాలా సమయం అవుతుండటంతో, విధిలేని పరిస్దితుల్లో కరోనా వైరస్ కోసం డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ శ్రీరాం ట్రాక్టర్‌ నడిపి ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. ఇకపోతే పెద్దపెల్లి జిల్లాలో 59 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడా ఆక్సిజన్ ఏర్పాట్లు లేవు.. చూశార మనపాలకుల పనితనం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: