ఈ రోజుల్లో చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు కొందరు అన్నం మానేసి ఏవేవో తినేస్తుంటారు. ఇలా చేయడం వలన కొత్తగా ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. బరువు తగ్గాలంటే ఓ పద్ధతి ప్రకారం, అవగాహనతో కసరత్తు చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. సరైనా అవగాహన లేకుండా చేసే పనులతో సన్నబడకపోగా మరింత లావెక్కుతారు. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

 

 

బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే పిండిపదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది.

 

 

కేవలం తక్కువగా తినడం ఎక్కువగా వ్యాయామం చేయడంతో సన్నబడరు. ఆ క్రమంలో జరిగే లోపాలను సరిదిద్దుకోవాలి. నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఉంది. వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఉంది. వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. శీతల పానీయాలూ, ఐస్ క్రీమ్‌లు, డార్క్ చాక్లెట్లూ, సాస్‌‌లకు దూరంగా ఉండాలి. వాటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మేలు. బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్‌ నూనె వంటివి ఆహారంలో తీసుకోవాలి.

 


కాఫీ, టీలలో చెక్కెర ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి. విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ యాక్సిడెంట్లూ అందించే పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ఇంట్లో వండిన పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్‌ఫుడ్‌‌కు దూరంగా ఉండాలి. రాత్రి వేళ తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వలన ఆరోగ్యాంగా ఉండచ్చు బరువును తగ్గించవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: