లోకంలో అందరికి ఒకటే ఆరాటం.. అదేమంటే.. ఉన్నవాడికి ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటం.. లేనివాడికి బ్రతుకుతో పోరాటం.. ఆ పోరాటంలో నుండే తన పిల్లలకు కడుపు నింపాలనే ఆరాటం పుడుతుంది.. ఇలా ఏ వైపు చూడు పేద మధ్య తరగతి, శ్రీమంతులు అనే భేదం లేకుండా ప్రతివారి జీవితాల చుట్టు ముళ్లకంచెలా మారింది కరోనా.. ఈ వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది.. ఇందులో ప్రజారవాణ వ్యవస్ద అయినా తెలంగాణ ఆర్టీసీపై కూడా కరోనా ఎఫెక్ట్​ పడింది.

 

 

అయితే లాక్​డౌన్​ సడలింపులతో బస్సులు రెండు నెలల నుండి నడుస్తున్నా ఇంకా ఆ సంస్థ గాడిన పడటంలేదు. అందులో ప్రయాణికులు సొంత వాహనాల్లో ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు.. ఈ నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసి నష్టాలను మూటగట్టుకుంటుంది.. ఇక గడిచిన రెండు నెలల్లో సుమారుగా రూ. 600 కోట్ల వరకు నష్టం జరిగినట్లు, రూ. 1,000 కోట్ల కలెక్షన్ కోల్పోయినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇక వచ్చే ఆదాయం డీజిల్ ఖర్చులకూ సరిపోవట్లేదని వెల్లడించారు..

 

 

ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం 10, 460 బస్సులు ఉండగా.. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ సడలింపుల తర్వాత సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో ప్రస్తుతం 3,500 నుంచి 3,800 వరకు బస్సులు నడుపుతున్నారు. దీంతో రోజుకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల కలెక్షన్‌‌‌‌ కూడా రావడంలేదు. అదీగాక ఈ మధ్యకాలంలో డీజిల్ రేట్లు పెరగడంతో వచ్చిన రూ. 2 కోట్లూ దానికే సరిపోవట్లేదని అధికారులు వాపోతున్నారు..

 

 

ఇకపోతే కరోనాకు ముందు సాధారణంగా ఆర్టీసీకి రోజుకు రూ. 12 కోట్ల నుంచి 13 కోట్లు వచ్చేదట.. ఒకవైపు కరోనా వల్ల ప్రజల జీవితాల్లో, జీతాల్లో కోతలు భరించలేని స్దాయిలో పడగా, మరోవైపు కరోనా వైరస్ అందరిని పట్టి పీడిస్తుంది.. ఇలాగే కరోనా తన ఉదృతి కొనసాగిస్తే ఇంకా ఎన్ని జీవితాలు చీకట్లో కనుమరుగైతాయో తెలియదు.. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య కూడా ప్రజల, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.. ఇలాంటి పరిస్దితుల్లో ఆ దేవుడే దీని బారినుండి లోకాన్ని కాపాడలి అనుకోవడం తప్పా చేసేది ఏం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: