అతను ఒక పోలీస్ కానిస్టేబుల్... ప్రజలకు రక్షణ కల్పించటం అతని కర్తవ్యం.. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించాలి... కానీ పోలీసే  ప్రజలకు సమస్య గా మారిపోయాడు... ముఖ్యంగా మహిళలను మాయమాటలు చెప్పి వేధించడం మొదలు పెట్టాడు. ఎంతో అమాయకంగా లిఫ్ట్ అడిగి... మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకుని ఆ తర్వాత తరచూ ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం స్టార్ట్ చేసాడు. ఇలా కారులో వెళుతున్న మహిళలు లిఫ్ట్ అడిగి నెంబర్లు తీసుకుని వేధిస్తున్న కానిస్టేబుల్ పై తాజాగా బంజారాహిల్స్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.



వివరాల్లోకి వెళితే టిఎస్ఎస్కి చెందిన 12 వ బెటాలియన్ కానిస్టేబుల్ వీరబాబు ఈనెల 7వ తేదీన జూబ్లీహిల్స్ నుంచి శ్రీనగర్ కాలనీ కి వెళ్తున్న ఓ కారును  లిఫ్ట్ అడిగాడు, సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో విధులకు హాజరు కావాలని వెంటనే వెళ్లాలని చెప్పడంతో  కారు లో ఉన్న మహిళ లిఫ్ట్ ఇచ్చింది, ఇక కారులోకి ఎక్కిన తర్వాత మహిళ తో మాట కలపడం మొదలుపెట్టాడు. తాను పోలీసునని ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయాలంటూ మహిళ ఫోన్ నెంబర్ తీసుకోవడంతో పాటు తన ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.



కానిస్టేబుల్ ను  దింపి మహిళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కానిస్టేబుల్ అసలు రూపం బయటపడింది. సదరు మహిళకు పదేపదే ఫోన్ చేయడం... చిత్రవిచిత్ర సందేశాలు పంపిస్తూ ఉండటంతో  ఆ మహిళ భయాందోళనకు గురైంది.. దీంతో కాస్త ధైర్యం తెచ్చుకుని షీ టీమ్స్ ని  ఆశ్రయించి ఈ విషయాన్ని తెలిపింది సదరు మహిళ. ఇక ఆ తర్వాత షీ టీమ్స్  సదరు కానిస్టేబుల్కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయగా  ఆ తర్వాత కూడా అతని తీరు మారలేదు. ఇటీవలే లక్డీకపూల్ లో ఓ వైద్యురాలి  కారును లిఫ్ట్ అడిగి... కిడ్నీ సమస్య ఉందని మాయమాటలు చెప్పి డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక ఆమెకు కూడా ఇలా పదేపదే ఫోన్ చేస్తూ ఉండటం మెసేజ్ లు పెడుతూ ఉండటంతో ఆ మహిళ కూడా షీ టీమ్స్  ని ఆశ్రయించింది... ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసే అరెస్టు చేశారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: