అవును.. ఇది నిజంగానే ప్రపంచం మొత్తానికి గుడ్ న్యూస్.. జగమంతా గడగడ వణుకుతున్న కరోనా రోగానికి వ్యాక్సీన్ వచ్చేసిందంటే మామూలు విషయం కాదు.. ఈ వ్యాక్సీన్ కోసం అనేక దేశాల్లోని మందుల కంపెనీలు కుస్తీలు పడుతున్నాయి. మన ఇండియాలోనూ అనేక కంపెనీలు ఇప్పటికే క్లినికల్ పరీక్షలు కూడా మొదలు పెట్టాయి. 

 

IHG


అయితే ఇండియన్ కంపెనీలు వ్యాక్సీన్ మార్కెట్లోకి తీసుకురావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. జనవరి నాటికి వ్యాక్సీన్  తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంతలోనే ఓ రష్యా సంస్థ మాత్రం క్లినికల్ పరీక్షలు  కూడా పూర్తి చేసేసిందట. ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. కరోనా వ్యాక్సీన్ పై క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్‌ ఫస్ట్‌ మాస్కో స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ’ అనౌన్స్ చేసింది. 

 

IHG's potential Covid-19 vaccines


అంతే కాదు.. ఇలా ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలి వ్యాక్సీన్  తమదేనని సగర్వంగా ప్రకటించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందాన్ని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రకటించింది. రష్యాలోని గమేలెయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ పై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది. 

 

పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయంటే.. మరి ఎప్పుడు ప్రారంభం అయి ఉండాలి... ఈ పరీక్షలు జూన్‌ 18నే ప్రారంభమయ్యాయి. అంటే దాదాపు 25 రోజుల్లోనే  క్లినికల్ పరీక్షలు పూర్తి చేసిందన్నమాట. అయితే ఇండియాలో మాత్రం ఈ పరీక్షలకు కనీసం 3 నెలల సమయం పడుతుంది. మన రూల్స్ అలా ఉన్నాయి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: