ఏపీ సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ గా మారిపోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జగన్ ను అనుసరించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు పారదర్శకంగా, వినూత్నంగా నిర్ణయం తీసుకుంటూ జగన్ ప్రత్యేక గుర్తింపు పొందడంతో పాటు, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో జగన్ కు వచ్చిన క్రెడిట్ అంతా ఇంతా కాదు. సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నించడమే కాకుండా, ఎక్కడా, ఎటువంటి లోపాలు తలెత్తకుండా, ఎటువంటి విమర్శలు తమ ప్రభుత్వం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు దేశవ్యాప్తంగా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో ఏపీ ముందువరుసలో ఉంది. 

IHG

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరిని అనుసరించేందుకు గాని, ఆదర్శంగా తీసుకునేందుకు కానీ ఇష్టపడరు.తనను చూసే అందరు ఫాలో అవ్వాలనుకునే రకం. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో జగన్ ను ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటివరకు కరోనా పరీక్షలు చేయించే విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, నిర్లక్ష్యం, తదితర కారణాలతో ఆయన విమర్శలకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కరోనా పరీక్షలు చేస్తే కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా, తెలంగాణ కు గుర్తింపు వస్తుందని, అది తనకు రాజకీయంగా చెడ్డపేరు తీసుకువస్తుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ విధంగా వ్యవహరించినట్లు విమర్శలు ఉన్నాయి.

 

 కానీ, రోజు రోజుకు తనపై విమర్శలు వర్షం కురుస్తుండడంతో, ఏపీలో ఏ విధంగా అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారో, అదేవిధంగా తెలంగాణలో నిర్వహించి విమర్శలకు చెక్ పెట్టాలనే ఆలోచనలోకి రావడమే కాకుండా వాటిని అమల్లో పెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్ సూచించిన ఆర్తీ - పీసీఆర్ పద్ధతిలో కోవిడ్ 19 పరీక్షలు చేస్తూ వచ్చింది. కానీ ఆ విధంగా చేయడం వల్ల ఖర్చు, శ్రమ తో కూడుకొవడంతో పాటు, ఫలితాలు వచ్చేందుకు బాగా ఆలస్యం అవుతుండడంతో, ఏపీలో నిర్వహిస్తున్నట్లుగా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించుకోవడంతో పాటు, ప్రస్తుతం ఆ విధంగానే పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహించి తమ ప్రభుత్వంపై పడిన నిర్లక్ష్యపు ముద్రను కేసీఆర్ చెరిపేసుకోవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: