దేశంలో కరోనా బీభత్సం కొనసాగుతుంది.. మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదు.. ఇక కరోనా సోకిన వారి పరిస్థితి అత్యంత దారుణం. మూడు నెలల క్రితం లాక్ డౌన్ కారణంగా అన్ని మూసిన వేసిన విషయం తెలిసిందే. నిత్యావసరాలకు మాత్రమే ఎవరైనా రావాలని ఆంక్షలు విధించారు.  ఇలా రెండు నెలల పాటు ఎలాంటి పనులు లేక ఎంతో మంది నానా అవస్థలు పడ్డారు. చాలా మందికి దయార్థ హృదయాలు ఉన్నవారు ఆదుకుంటే ఆ రోజుకి పూట గడిచిన పరిస్థితి ఏర్పడింది. ఇక దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత కాలంలో రూ.10కి భోజనం కడుపు నిండా భోజనం పెడుతూ అందరి హృదయాలు గెల్చుకున్నారు రాము అనే ఓ వృద్దుడు.  

 

సుమారు 50 సంవత్సరాలుగా రాము హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఇక రాము గురించి స్థానికులు మాట్లాడుతూ... ప్రారంభం నుంచే ఆయన రూపాయి, రూ.2లకే భోజనం పెట్టేవారని తెలిపారు.  నిత్యావసర సరుకులు రేట్లు ఎంత పెరిగిపోయినా.. ఆయన మాత్రం ఎవ్వరి వద్ద డబ్బులు ఎక్కువ తీసుకోకుండా రూ. 2 మాత్రమే తీసుకునేవారు.. ఆ తర్వాత రూ.10 లకు కడుపు నిండా భోజనం పెడుతూ వారికి బాగోగుల గురించి అడిగి తెలుసుకునేవారని అన్నారు.  

 

కొందరు భోజనం చేశాక తోచినంత సాయం అందించేవారని చెప్పారు. వారితోపాటు స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు కూడా అండగా నిలిచాయని తెలిపారు. ఆ మొత్తంతోనే మిగతావారికి కూడా తక్కువ ధరకే భోజనం పెట్టేవారని గుర్తుచేసుకున్నారు. కుటుంబ ఖర్చులకు లేకపోయినా హోటల్‌ నిర్వహణను మాత్రం మానుకోలేదని కొనియాడారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: