దేశంలో కరోనా ఉధృతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే మూడు నెలల లాక్‌డౌన్‌ తర్వాత భవన నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సమాచారం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మ నిర్భర్‌ పథకం ద్వారా స్థిరాస్తి వ్యాపారులకు, కొనుగోలుదారులకు భారీ రాయితీలు ప్రకటించారు.

 

 

అయితే రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక వాటాదారుగా పరిగణించే స్థిరాస్తి వ్యాపారం స్థిరమైన వ్యాపారం లేక చతికిలపడిందన్నారు. భారీ నుంచి మధ్యతరహా కట్టడాలకు కూలీలు దొరక్క, కట్టడ సామగ్రి సరైన సమయానికి అందక మధ్యలోనే నిలిచిపోయాయి. పూర్తయిన ఇళ్లకు బాడుగదారులు లేక అద్దె కొరకు (టు-లెట్‌) బోర్డులతోనే సరిపెట్టుకున్నాయి. దేశవ్యాప్త స్థిరాస్తి వ్యాపారంలో కర్ణాటక వాటా 25శాతానికంటే ఎక్కువే.

 

 

అయితే బెంగళూరులో ఏ వీధిలో చూసినా టు-లెట్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బెంగళూరులో ప్రతి ఐదింటిలో ఓ ఇల్లు ఖాళీగా ఉన్నట్లు ఉత్తర బిల్డర్‌ సమాఖ్య త్రైమాసిక సమీక్ష ద్వారా వెల్లడైయిందన్నారు. రూ.5 వేల కనీస అద్దె మొదలు రూ.50 వేలు వసూలు చేసే ఇళ్లకు కూడా బాడుగదారులు దొరకని పరిస్థితి తలెత్తిందని ఈ సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ భూషణ్‌ తెలియజేశారు. ఏటా మే, జూన్‌ నెలల్లో బాడుగ ఇళ్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఈసారి బాడుగలను 30శాతం తగ్గించినా బాడుగదారులు కరవైనట్లు బెంగళూరు బిల్డర్ల సమాఖ్య సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు.

 

 

అయితే ఈ పథకాలేవీ కర్ణాటకలో భవన నిర్మాణాలను అంతగా ఆదుకోలేకపోయినట్లు ప్రముఖ స్థిరాస్తి వ్యాపార కన్సల్టెంట్‌ దీపక్‌ నివేదిత్‌ తెలియజేశారు. రవాణా సదుపాయాలు లేక కట్టడ సామగ్రి తగిన సమయంలో చేరకపోవటం, సిమెంట్‌, ఉక్కు, ఎలక్ట్రికల్‌ సామగ్రి ధరలు 20 నుంచి 30 శాతం పెరగటం వల్ల ఈ నిర్మాణ వ్యయం భారీగా పెరగటంతో కట్టడాలు నిలిచిపోయాయని ఈ సందర్బంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: