దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కానీ తరగడం లేదు. అయితే ఈ కష్టకాలంలో చాల మంది జీవనోపాధి కోల్పోయారు. కరోనా కేసులు శరవేగంగా పెరగడంతో ఇంట్లో నుండి బయటికి రావడానికే ప్రజలు భయపడిపోతున్నారు.

 

 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా..? అది కూడా కోటీశ్వరులు కావాలని కల కంటున్నారా? అయితే మీకు మీ కల సాకారం చేసుకోవడానికి ఒక ఆప్షన్ అందుబాటులో వచ్చింది. చేతిలోని డబ్బుతో అదిరిపోయే రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో డబ్బులు పెడితే చాలు. దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావొచ్చని అంటున్నారు నిపుణులు. 

 

 

అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూపంలో డబ్బులు ఇన్వె్స్ట్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో రూ.కోటి వెనకేసుకోవచ్చునన్నారు. అయితే ఇది అంత ఈజీ కాదు. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలన్నారు. క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలని తెలియజేశారు.

 

 

అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ స్క్రిప్ బాక్స్ ప్రకారం.. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ పొందొచ్చునన్నారు. రూ.కోటి సంపాదించాలంటే.. ఇన్వెస్ట్ చేసే మొత్తం, ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నారు.

 

 

అయితే సిప్ రూపంలో నెలకు రూ.7,000 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 20 ఏళ్లలో రూ.కోటి పొందొచ్చునన్నారు. అంటే రోజుకు రూ.230 ఆదా చేయాలి అన్నమాట. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌పై వార్షిక రాబడి 10 శాతంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు. అదే మిలియనీర్లు అయితే పదేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చునన్నారు. దీని కోసం నెలకు ఏకంగా రూ.33,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 10 శాతం రాబడి ప్రాతిపదికన కోటీశ్వరులు కావొచ్చునన్నారు. అయితే ఇక్కడ మీకు వచ్చే రాబడి మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా మారొచ్చునని నిపుణులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: