కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే.. మాస్కు తొడుక్కోవాలి.. సామాజిక దూరం పాటించాలి.. అంతేనా.. ఇంకో కీలక విషయం. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకే ఇప్పుడు జనం ఈ ఇమ్యూనిటీ పెంచే ఆహారంపై దృష్టి సారిస్తున్నారు. దాని ఫలితంగానే ఈ ఇమ్యూనిటీ బూస్ట్‌ చేసే ఆహార పదార్ధాలకు గిరాకీ పెరిగిపోయింది. 

 

IHG


ఈ రోగనిరోధక శక్తి పెంచే ఆహారంలో నిమ్మకాయకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ సిట్రస్ ఫలాలు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయని.. కరోనా వచ్చిన మొదట్లోనే ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ నిమ్మకాయల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఉపకరించే  సి-విటమిన్‌ అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 

 

IHG


హైదరాబాద్ నగరానికి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి నగరానికి ఇవి ట్రాన్స్ పోర్ట్ అవుతున్నాయి. మామూలు రోజుల్లో అయితే  వర్షాకాలంలో ఈ నిమ్మకు అంత డిమాండ్ ఉండదు. వేసవి కాలం ఈ నిమ్మ అమ్మకాలకు మంచి సీజన్. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని..వర్షాకాలంలోనూ డిమాండ్‌ పెరిగింది.

 

నిమ్మరసం వేడి నీళ్లలో, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసంలోని విటమిన్‌-సి ద్వారా అందే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే కరోనా రోగులకు సి-విటమిన్‌ ట్యాబ్‌లెట్లు కూడా అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: