భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.

 

తాజాగా కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. మంత్రి రవికి కరోనా సోకగా, అతని భార్య పల్లవితోపాటు మంత్రి వ్యక్తిగత సిబ్బందికి కరోనా నెగిటివ్ అని వచ్చింది.  ఈ మద్య కాలంలో వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రవికి కరోనా హాట్ టాపిక్ గా మారింది. 

 

ఈ నేపథ్యంలో నేను పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చింది...నేను క్షేమంగానే ఉన్నాను...నా భార్య పల్లవి, నా సిబ్బందికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని వచ్చింది’’ అని మంత్రి సీటీ రవి సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. తాను చికిత్స పొందుతూనే మంత్రిగా పనిచేస్తున్నానని రవి చెప్పారు. త్వరలో తాను కరోనా నుంచి కోలుకొని వస్తానని మంత్రి రవి వివరించారు.కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36,216 కు చేరింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: