టాలీవుడ్ బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ వున్న జంట ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది సుడిగాలి సుదీర్ రష్మి గౌతమ్ జంట. జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు అన్ని తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి, ఇక సోషల్ మీడియాలో వీరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందని అంటూ వచ్చిన వార్తలు వీరిని మరింత ఫేమస్ చేశాయి. ప్రస్తుతం బుల్లితెరపై ఇద్దరు కలిసి కనిపించారు అంటే ప్రేక్షకులందరూ మురిసిపోతూ ఉంటారు. ఇక రష్మీ కోసం సుధీర్ చెప్పే డైలాగులకు బుల్లితెర ప్రేక్షకులందరు ఫిదా అయిపోతున్నారు. 

 

 ఇక వీరిద్దరి మధ్య నిజంగానే  లవ్ రిలేషన్షిప్ ఉంది అని కొందరు... లేదు కేవలం టీవీ ప్రోగ్రాంలో కోసం మాత్రమే అలా చేస్తారు అని మరి కొందరు అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ జంటను చూస్తుంటే ఎంతో  ముద్దుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. నిజంగా రష్మీ సుధీర్ పెళ్లి చేసుకుంటే... బుల్లితెర ప్రేక్షకులు అందరూ తెగ ఆనంద పడిపోతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు జబర్దస్త్ లో  రష్మి సుదీర్ అలరిస్తూనే మరోవైపు ఢీ  జోడి లో కూడా తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అవుతున్న విషయం తెలిసిందే. పండగలకి బుల్లితెరపై ఏ  ఈవెంట్ జరిగినా కూడా ఈ ఇద్దరూ  సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారి పోతూ ఉంటారు. 

 

 అయితే తాజాగా సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. కాగా ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. రష్మీ సుధీర్ బంధం గురించి ఆలీ చాలా లోతుగా  ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయగా వారిద్దరు కూడా ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సుధీర్ అందరూ నిన్ను రొమాంటిక్ గా ఎందుకు చూస్తారు అని అలీ ప్రశ్నించగా... సుధీర్ సమాధానం చెప్పే లోపే.. అది నిజమే కదా.. సుధీర్ లోని రొమాంటిక్ యాంగిల్ ఎంతో బాగుంటుంది అంటూ రష్మి సమాధానం చెప్పింది... దీంతో పక్కనే ఉన్న సుధీర్ పగలబడి నవ్వాడు. ఇక రష్మీ  సమాధానం విన్న అలి  కాస్త షాక్ అయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: