కరోనా కాలంలో చాలా మందికి ఆదాయం తగ్గింది. ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా తెచ్చిన ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా అవసరానికి కావాల్సిన డబ్బును సమకూర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి ఇప్పుడే.కరోనా సంక్షోభం చాలా మంది జీవితాలను తలకిందులు చేసింది. ఉద్యోగం చేస్తున్నా.. కంపెనీలు జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఆదాయం తగ్గినంత మాత్రాన ఖర్చులు తగ్గవు కదా! ఎలాంటి పరిస్థితులు ఉన్నా సాధారణ ఖర్చులు ఉండనే ఉంటాయి. ఇలాంటి సంక్షోభం మళ్లీ ఎప్పుడైనా రావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉంటే ఏమిటవి?

 

 

దీర్ఘకాలిక అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంటారు చాలా మంది. ప్రస్తుతం ఏర్పడిన అవసరాలను తీర్చుకునేందుకు..పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండానే ఆదాయం పొందొచ్చు.
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్​ ఫండ్లు, బాండ్లను తనఖా పెట్టడం ద్వారా రుణాలు ఇస్తుంటాయి పలు రుణ సంస్థలు. పెట్టుబడుల విలువ ఆధారంగా రూ.కోటి నుంచి రూ.20 కోట్ల వరకు వీటి ద్వారా రుణాలు పొందొచ్చు. కనీస రుణ లభ్యత రూ.50 వేలుగా ఉంది. రుణ పరిమితి మీరు తాకట్టు పెట్టే పెట్టుబడులలో 50 నుంచి 80 శాతం వరకు ఉంటుంది.

 

ప్రస్తుతం బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు పూర్తిగా డిజిటల్ రూపంలో సేవలందిస్తున్నాయి. అందువల్ల ఇంట్లో నుంచే సలభంగా ఇలాంటి రుణాలు పొందొచ్చు.
చిన్న చిన్న పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, గోల్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి కూడా రుణాలు పొందొచ్చు.సాధారణంగా ఇలాంటి రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏడాది గడువు విధిస్తుంటాయి రుణ సంస్థలు. వడ్డీ రేటు 8 నుంచి 10 శాతం వరకు(రుణ సంస్థలనుబట్టి మారొచ్చు) ఉంటుంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), జీవిత బీమాలాంటి వాటి ద్వారా కూడా రుణాలు పొందే వీలుంది. పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణాలు పొందేందుకు అవకాశముంది.పీపీఎఫ్ ఖాతాలో రెండో సంవత్సరం చివరి నాటికి ఉన్న మొత్తంలో 25 శాతానికి సమానంగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: