దేశం మొత్తం రాజస్థాన్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో పడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై అదే పార్టీ కి చెందిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తిరుగుబాటుకు రెడీ అయ్యారు. తన వర్గానికి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేల చేత సచిన్ పైలెట్ సోనియాగాంధీని కలవడం జరిగింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన టైంలో సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి పదవి ఆశించడం జరిగింది. అయితే ఆయన ఆశలకు అధిష్టానం భంగపాటు కల్పిస్తూ అశోక్ గెహ్లాట్ కి కాంగ్రెస్ పెద్దలు సీఎం పదవిని కట్టబెట్టారు. అప్పటి నుండి సచిన్ పైలెట్ పై పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని టాక్. ఈ విషయం మీద హైకమాండ్ కి ఫిర్యాదు చేయాలని సోనియా గాంధీని సచిన్ పైలెట్ కలవాలని రెడీ అయినట్లు టాక్.

 

ఇదిలా ఉండగా సచిన్ పైలెట్ బీజేపీ లో చేరుతారని మరోపక్క ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయం మాదిరిగానే రాజస్థాన్ రాజకీయం కూడా తయారవుతుందని కొంతమంది  పేర్కొంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియా గతంలో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో సచిన్ పైలెట్ తన వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలతో వేరే కుంపటి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. ఏం జరుగుతుందో అని దేశమంతటా ఉత్కంఠ నెలకొంది.

 

ఒకవేళ సచిన్ పైలెట్ తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీలో చేరితే మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్ లో రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సచిన్ పైలెట్ తండ్రి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే రాజేష్ పైలెట్ కుమారుడు. ఈ సందర్భంగా ఆయన ని శాంతింప చేయడానికి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు రంగంలోకి దిగినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క బీజేపీ ఈ గొడవంతా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ... అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: