దేశంలో వైరస్ దెబ్బకి మళ్లీ చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్షాకాలం పైగా తక్కువ భూభాగం మరియు ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో చాలా ప్రాంతాలలో మరియు మార్కెట్ కలిగిన ప్రాంతాల చుట్టూ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. దీంతో రెడ్ జోన్ ప్రాంతాలు ఎక్కువ అయిపోయాయి. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలలో వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని కొద్దీ బయట పడుతున్నాయి. లాక్ డౌన్ ముందు పరిస్థితి ఒకలా ఉంటే తర్వాత ఇప్పుడు మరింత దారుణంగా అసలు అదుపుచేయలేని పరిస్థితి అనే రీతిలో తయారయింది. ఇటువంటి తరుణంలో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్ లాక్ డౌన్ కే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

వినపడుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు, తెలంగాణ మరియు కర్ణాటక  అదేవిధంగా పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ టోటల్ లాక్ డౌన్ అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. చాలావరకు ఉత్తరాది ప్రాంతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వర్షాకాలం కావడంతో చాలా వరకు వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో రోజుకు రెండు వేల కేసులు నమోదైన పరిస్థితి ఉందట. కానీ ఏపీలో ఎక్కువ టెస్టులు జరుగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ వైరస్ చైన్ తెగిపోతుందని, క్యారియర్ లేకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా నిర్ధారణ పరీక్షలతో అరికడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మరోపక్క ఇలాంటి టైంలో మళ్లీ లాక్ డౌన్ దేశమంతటా పెడితే ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుంది అనే ఆలోచనలో కేంద్రం ఉందంట. దీంతో మళ్లీ లాక్డౌన్ కి సంబంధించిన నిర్ణయాలను పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వటం జరిగిందట. మరి వైరస్ కేసులు దేశం లో ఎక్కువ వస్తున్న తరుణంలో ఈ టైం లో పూర్తి లాక్ డౌన్ కి ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: