దేశంలో ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి వరుసగా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర,రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కుసులు నమోదు అవుతున్నాయి.  భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

 


దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ కోవిడ్ కేర్‌లో చేరిన తొలి కరోనా రోగి కోలుకున్నారు.  ఇప్పటి వరకు ఇందులో 147 మంది కరోనా రోగులు చేరారు. వైరస్ నుంచి కోలుకున్న తొలి రోగి సోమవారం డిశ్చార్జి అయినట్లు ఐటీబీటీ అధికారులు తెలిపారు. 

 


రాధా సోమి బియాస్‌లో ఏర్పాటు చేసిన కరోనా దవాఖానను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత పెరుగడంతో ఛతర్‌పూర్‌లోని ఆశ్రమంలో వెయ్యి పడకల కరోనా సంరక్షణ కేంద్రాన్ని యుద్ధపాత్రిపదికన ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం బాధ్యతలను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో కరోనా కట్టడి చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నాని అన్నారు సీఎం కేజ్రీవాల్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: