వైయస్ జగన్ రాజధాని తరలింపు విషయంలో ఎలాంటి హడావుడి లేకుండా తన పని తాను చేసుకు పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 14వ తారీఖున శాసనమండలిలో ఆటోమేటిక్ గా రాజధాని కి సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉన్న తరుణంలో టీడీపీ ఈ నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా హైకోర్టులో శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ బిల్లు విషయంలో వ్యవహరించిందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అత్యవసర కేసులు హైకోర్టు చూస్తున్న తరుణంలో ఈ పిటిషన్ పక్కన పెట్టేసింది.

 

ఇలాంటి తరుణంలో దీపక్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా చాలావరకు కరోనా నేపథ్యంలో అత్యవసర కేసులు చూస్తున్న సుప్రీంకోర్టు ...హైకోర్టు పక్కన పెట్టేసిన అంశానికి సంబంధించిన దానిపై విచారణ చేసే అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తారీఖున క్యాబినెట్ సమావేశం జగన్ నిర్వహిస్తున్న తరుణంలో చాలా వరకు రాజధాని తరలింపు పనులకి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఎలాంటి హడావుడి లేకుండా చాలావరకూ సైలెంట్ గా అమరావతి నుండి విశాఖ కి రాజధాని తరలింపు పనులు ఏపీ ప్రభుత్వం చేయటానికి రెడీ అయినట్లు సమాచారం.

 

విశాఖకు రాజధాని తరలింపు విషయంలో జగన్ చాలా సైలెంట్ గా ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. ఇప్పటికే ఈ విషయంలో అమరావతి లో ఆందోళనలు నిరసనలు జరుగుతున్న తరుణంలో పెద్దగా మీడియా కన్ను కూడా పడకూడదనే ఆలోచనలతో దశలవారీగా అమరావతి నుండి కొన్ని శాఖలను విశాఖ కి వైయస్ జగన్ పంపించడానికి డిసైడ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: