రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన కే‌సి‌ఆర్ కి కరోనా వైరస్ ముప్పు తిప్పలు పెడుతుంది. పరిపాలన పరంగా ఎలాంటి సమస్య రాకపోయినా ప్రకృతిపరంగా వచ్చిన కరోనా వైరస్ దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పై రాని విమర్శలు కే‌సి‌ఆర్ పై వచ్చేలా చేస్తుంది. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో వైరస్ ని చాలా ఈజీగా ఎదుర్కొంటాము అన్నట్టుగా కేసీఆర్ మీడియా సమావేశాలు నిర్వహించారు. సాక్షాత్తు అసెంబ్లీలో కే‌సి‌ఆర్ కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ చిన్న పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే దెబ్బకి బాడీ లోకి ప్రవేశించే పరిస్థితి ఉండదు. దానికంత సీన్ అవసరం లేదని చాల ఈజీగా చెప్పుకొచ్చారు. అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనా వైరస్ ఎవరికి రాకుండా చూసుకుంటామని, మాస్క్ లు ఏమి పెట్టుకోకుండా ఎమ్మెల్యేలు మంత్రులంతా ప్రజల కోసం పని చేస్తారని కే‌సి‌ఆర్ భారీ భారీ డైలాగులు అసెంబ్లీలో వేశారు.

 

సీన్ కట్ చేస్తే ఇప్పుడు హైదరాబాదులో ఎమ్మెల్యేలకు మంత్రులకు అదే విధంగా చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా కరోనా బారిన నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంపై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. కరోనా బారిన రోగులకు కనీస సదుపాయాలు కే‌సి‌ఆర్ ఇవ్వటం లేదని చాలా మంది రోగులు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ప్రభుత్వం స్పందించకపోవడంతో గవర్నర్ ని ఆశ్రయిస్తున్నారు.

 

ఇలాంటి తరుణంలో వైరస్ ప్రభావం ప్రస్తుతం హైదరాబాదు నగరంలో ఎక్కువగా ఉండటంతో కే‌సి‌ఆర్ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా మళ్లీ లాక్ డౌన్ లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆయువుపట్టు హైదరాబాద్ నగరం కావడంతో. ఏ మాత్రం నగరంలో వైరస్ ప్రభావం లేకుండా కే‌సి‌ఆర్ హైదరాబాదుని పూర్తి లాక్ డౌన్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: