వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు దాదాపు పాతిక లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉగాది పండుగ నాడు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ టైమ్ లో టెక్నికల్ కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా వైరస్ రావడం దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ నెల జూలై 8 వ తారీఖున తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయాలని జగన్ డిసైడ్ అయిన సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడి ఆగస్టు 15 కి పోస్ట్ పోన్ అయ్యింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం వర్షాలు రాష్ట్రంలో ఎక్కువగా పడటంతో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిన వాటిలో భారీ స్థాయిలో నీళ్లు రావడం వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగన్ ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. అలాంటి నీరు ఉన్న చోట ఇల్లు కట్టుకుని మేము ఎలా బతుకుతాం బాబు అంటూ లబ్ధిదారులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి చోట్ల మొక్కలు నాటితే ప్రభుత్వానికి లాభం వస్తుంది. మేం బతికితే మా ప్రాణాలు పోతాయని లబ్ధిదారులు విమర్శలు చేస్తున్నారు. ఇల్లు కట్టుకున్న మునిగిపోయే పరిస్థితి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

మరోపక్క తెలుగుదేశం పార్టీ టైమ్ లో అపార్ట్మెంట్ల మాదిరిగా కట్టిన ఫోటోలను టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ఇది విజన్ అంటే అంటూ జగన్ సర్కార్ పంచి  పెడతాం అంటున్న భూములపై కౌంటర్లు వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో పడుతున్న విస్తార వర్షాలు జగన్ పంచిపెడతారు అంటున్న భూముల విషయంలో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: