దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. రోజుకి కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మళ్లీ దేశమంతటా లాక్ డౌన్ అమలు చేస్తే ఆర్థిక రంగం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉండటంతో దేశంలో ప్రధాన నగరాల్లో ఎక్కువగా వైరస్ కేసులు వస్తున్నా నగరాల పై కేంద్రం కన్ను వేసినట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు మరియు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ప్రధాన నగరాలలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నగరాలలో మళ్ళీ  లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీ అవ్వుతున్నాయి. 

 

కాగా ఇప్పటికే జులై 14 నుండి ఏడు రోజులపాటు బెంగళూరు నగరంలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. ఇదే తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిస్థాయిలో లాక్ డౌన్ లో పెట్టాలని త్వరలో అమలు చేయాలని డిసైడ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా వరకు ప్రధాన నగరాలలో రాకపోకలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో పైగా వీకెండ్ టైములో ఎక్కువ రాకపోకలు ఉంటున్న తరుణంలో కేంద్రం ప్రధాన నగరాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం దాకా రెండు రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుచేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే ఈ తరహా లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 55 గంటల పాటు ప్రతి వారం రెండు రోజులు లాక్ డౌన్ అమలు చేస్తోంది. మినీ లాక్ డౌన్ పేరిట రాష్ట్రంలో ఐదు రోజులు కార్యాలయాలు మరియు మార్కెట్లు మాత్రమే తెరవాలని యూపీ  ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇదే తరహాలో కేంద్రం కూడా మిగతా రాష్ట్రాలలో ఉన్న ప్రధాన నగరాలలో మినీ లాక్ డౌన్ అమలు చేయాలనీ అనుకుంటున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: