ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేశ్ కు షాక్ తగిలింది. ఈ స్కామ్ లో నిందితుడు అయిన ఆయన ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి సురేష్ కు ముందస్తు బెయిల్ రాలేదు. ఆయన హైకోర్టు ద్వారా బెయిల్ పొందడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు.


సురేశ్ తో పాటు మరో ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారి కూడా ప్రయోజనం దక్కలేదు. ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడు  జైలు రిమాండ్‌ లో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఏసీబీ..  పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు గుర్తించింది. 

 

IHG


పితాని మంత్రిగా ఉన్న సమయంలో అంతా సురేశ్ హవానే నడిచేదట. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అంతే కాదు.. చాలా మంతి తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారట. 

 

IHG


ముందస్తు బెయిల్ రాలేదంటే.. సురేశ్ ప్రమేయంపై గట్టి ఆధారాలు దొరికినట్టే భావించవచ్చు. ఇప్పటికే అచ్చెన్నాయుడిని ఏసీబీ విచారిస్తోంది. ఇప్పుడు ఆయన చెప్పే ఆధారాల ఆధారంగా సురేశ్ ను కూడా ఏసీబీ విచారించే అవకాశం ఉంది. మరి ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: