ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విషయంలో సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోనున్నారా...? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి బీజేపీ, తెలుగుదేశం శాసనమండలిని రద్దు చేయకూడదనే కోరుకున్నాయి. టీడీపీకి భవిష్యత్తులో కొన్ని సీట్లు సాధించుకునే అవకాశం ఉన్నా బీజేపీకి ఆ అవకాశం కూడా లేదు. అయినప్పటికీ ఏపీ బీజేపీ నేతలు శాసన మండలి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
మండలి ద్వారా పార్టీలు నమ్మకంగా ఉన్న నేతలకు పదవులు ఇవ్వడంతో పాటు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలను క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేయడంతో జగన్ సర్కార్ మండలి రద్దు దిశగా చర్యలు చేపట్టింది. పెద్దల సభ అంటే రాజకీయంగా సలహాలు ఇచ్చే వేదిక. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడానికి, బిల్లులు వాయిదా వేయడానికి వేదికగా మారింది. 
 
అయితే తాజాగా గత ఎన్నికల్లో అధినేత మాట కోసం తన సీటును త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అయినటు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఆశావాహుల్లో ఆయన ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్నారనే చెప్పాలి. సీఎం జగన్ శాసనమండలి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోనున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది. 
 
జగన్ నిర్ణయం మార్చుకుంటే మాత్రం ఇకపై శాసనమండలి రద్దు కోసం కేంద్రం సహాయం కోరాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేసే నిర్ణయంపై పునరాలోచించాలని జగన్ పై పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. మర్రి రాజశేఖర్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారని వస్తున్న వార్తలతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయని తెలుస్తోంది. శాసనమండలి రద్దు విషయంలో జగన్ ఏ విధంగా ముందుకెళ్లనున్నారో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: