భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,701 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు.గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1269 కరోనా వైరస్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

 

8 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం ‌నమోదైన కేసుల్లో ఒక్క ghmc పరిధిలోనే 800 కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 34,671 కోవిడ్ కేసులు న‌మోదు కాగా.. వైర‌స్ బారిన ప‌డి మరణించిన వారి సంఖ్య 356కు చేరింది.  అయితే ఈ మద్య కరోనా తెలంగాణ పోలీసుల వెంట పడుతుంది. ఇప్పటికే పలువురు కరోనా భారిన పడ్డారు.

 

కాగా,  కోవిడ్-19 బారిన పడి కోలుకున్న 31 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లోకి చేరారు. కరోనా బారిన పడి కోలుకున్న31 మంది ట్రాఫిక్ పోలీసులను సీపీ అంజనీకుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రొఫెషనల్ పోలీస్ లైఫ్‌లో ఇంత కష్టతరమైన పరిస్థితి రావడం.. దానిని పోలీస్ సిబ్బంది అధిగమించడం సంతోషమన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కరోనా ప్రబలి పోయిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ముందు వుంది ప్రజలకు సేవ చేయడం హర్షణీయమని అంజనీకుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: