జిల్లాల విభజన అన్నది పాలనాపరంగా మరింత సులువు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకునేది. నిజానికి పెరుగుతున్న జనాభా, అలాగే కొత్తగా వెలుస్తున్న పట్టణాలు, వీటిని ద్రుష్టిలో పెట్టుకుంటే కనీసం ప్రతీ రెండు దశాబ్దాలకు కొత్త జిల్లాల విభజన జరగాలి. కానీ ఏపీలో మాత్రం జనాభా చూస్తే ఆరు కోట్ల పై చిలుకు ఉంది. జిల్లాలు మాతం పదమూడే ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా జిల్లాల విభజన ఊసే లేదు. 

 

అదే నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణాకు 33 జిల్లాలు ఉన్నాయి. ఇక తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే జిల్లాలు ఉన్నాయి ఈ క్రమంలో జగన్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దాని  ప్రకారం ఇపుడు జిల్లాల విభజనకు ఆయన పూనుకుంటున్నారు.

 

అయితే ఇందులో పాలనతో పాటు రాజకీయ అవసరాలు కూడా ఉంటాయని అంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ తమకు అనుకూలంగా విడగొట్టుకునే సదుపాయం ఇపుడు జగన్ కి వచ్చింది. చంద్రబాబు అయిదేళ్ల కాలంలో ఇలా చేసుకోలేకపోయారు. ఇపుడు జగన్ ఎంచక్కా ఈ అవకాశాన్ని పార్టీ పటిష్టతకు కూడా వాడుకుంటున్నారు.

 

టీడీపీకి ఉత్తర కోస్తాలో బలం ఎక్కువ. దాంతో అలాగే దక్షిణ కోస్తాలో కూడా కొన్ని చోట్ల ఆధిపత్యం చూపుతోంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని జగన్ జిల్లాల విభజన చేపడుతున్నారు. తమకు అనుకూలంగా ఎక్కడికక్కడ ముక్కలు చేసుకుంటూ వెళ్తే జిల్లాల్లో బలాబలాలు ఒక్కసారిగా మారిపోతాయి.దాంతో గోల పెట్టడం టీడీపీ వంతు అవుతోంది.

 

ఇప్పటికే దీని మీద టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారుట. జగన్ ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తారో చూసి దాని  ప్రకారం  తన ఆందోళనను సిధ్ధం చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాల విభజనతో రాజకీయంగా టీడీపీకి గట్టి దెబ్బ కొట్టాలని జగన్ పక్కాగా  డిసైడ్ అయ్యారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: