దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వైరస్ పుట్టుకకు కారణమైన చైనా వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ధాటికి అతలాకుతలమయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయంటూ ఆర్థికవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రపంచం అంతటా ప్రజలు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోయారు. భారత్ లో 14 కోట్ల 70 లక్షల మంది కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రముఖ సంస్థ అంచనా వేసింది. కరోనా వల్ల ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ సందర్భంలో సవాళ్లను అధిగమించే దిశగా పలు దేశాల ప్రభుత్వాలు ముందడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా భారత్ లాక్ డౌన్ సమయంలోను పలు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. 
 
ఇదే సమయంలో మోదీ సర్కార్ రైల్వేలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్యాసింజర్ రైళ్లకు కేంద్రం పెద్ద ఎత్తున నడుపుతున్నా ఆ రైళ్ల ద్వారా పెద్దగా ఆదాయం చేకూరదు. కేంద్రానికి 100 శాతం లాభాలలో 70 శాతం లాభాలు గూడ్స్ రైళ్ల ద్వారానే వస్తాయి. గూడ్స్ రైళ్ల ద్వారా ఎక్కువ సరఫరా చేయడంతో పాటు ఉత్పత్తుల సరఫరా ఎంత పెరిగితే అంత ఆదాయం పెరుగుతుంది. 
 
దేశంలో 2019 వరకు గంటకు 23 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ రైళ్లు ప్రయాణించాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గూడ్స్ రైళ్ల ద్వారానే పీపీఈ కిట్లు, మందులు, ఇతర ఉత్పత్తుల సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం 42 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ రైళ్లు నడుస్తుండగా వేగాన్ని 100 కిలోమీటర్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అతి త్వరలో ప్రయాణికులు ప్రయాణించే రైళ్ల వేగం కూడా పెరగనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: