అవును కాలదా మరి. అప్పట్లో  ఏదో తన సొమ్మేదో పోయినట్లుగా ఊరంతా గొడవ చేసి దీక్షలు ధర్నాలు అంటూ చంద్రబాబు నానా యాగీ చేశారు. రక్తం మరగదాండీ అంటూ చాలా బాగానే దీర్ఘాలు కూడా  తీశారు. మరి ఇపుడు వైసీపీలో ఒక ఎంపీ గారు చేస్తున్న దానికి వైసీపీకి కూడా ఎక్కడో కాలుతోందిట. కాలదా మరి ఇది పూర్తిగా తమ సొమ్మే. ఇలా బీజేపీ తెర వెనక  ఉన్నదా అన్న డౌట్ కూడా వస్తోందిట.

 


రాజు గారి మీద అనర్హత  వేటు వేస్తే ఆయన మాజీ అవుతారని వైసీపీ భావించింది. ఫిర్యాదు చేయడం వరకే బాధ్యత కాబట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ ఇచ్చేసి వచ్చేసింది. ఇక ఆ తరువాత కధ వేరేగా ఉంది. కనీసం తన మీద వేటుకు ఫిర్యాదు వైసీపీ పెద్దలు ఇచ్చారన్నది కూడా లేకుండా రాజు గారు రోజురోజుకూ  రెచ్చిపోతున్నారు. ఆయనలో ఎక్కడ లేని జోష్ వచ్చేసింది.

 

తన పదవి పోతుందన్న కంగారు, కలవరం ఆయనలో ఎక్కడా కనిపించడంలేదు. పైగా ఆయన రోజుకో రకంగా వ్యవహరిస్తూ వైసీపీ పెద్దల టెంపరేచర్ ఒక్కలా  పెంచేస్తున్నారు. వైఎస్సార్ తన ఆరాధ్యదైవం అని ప్రకటించిన నోటితోనే వైసీపీ పెద్దలను గట్టిగా వేసుకుంటున్నారు.

 

ఇపుడు చూస్తే నెల్లూరు పెద్దాయన ఆనం రామనారాయణరెడ్డితో కలసి సెల్ఫీ దిగి వైసీపీకి హై బీపీ పెంచేసిన రాజు గారు  మరోవైపు జనసేనాని  పవన్ కళ్యాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పవన్ వంటి నిజాయతీపరుడు ఏపీ సీఎం  కావాల్సింది అంటున్నారు. ఆయన్ని ఓడించిన ప్రజలు న్యాయం కోసం మాట్లాడం తగదు అంటున్నారు.

 

ఇక 2024లో పవన్ సీఎం అయితే కచ్చితంగా అయిదేళ్ళలో  ఏపీ నంబర్ వన్ గా దేశంలో ఉంటుందని కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే రాజు గారు బాగానే గిల్లుతున్నారు. అనర్హత వేటు పిటిషన్ అలా ఉండగానే బహిష్కరణ వేయించుకుందామనుకుంటున్నారో. లేక బీజపీలోకి చేరి జనసేన మద్దతు తీసుకుని ఎంపీగా పోటీ మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీకి మాత్రం ఆయన ఓ రేంజిలో సినిమా చూపిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: