గత కొన్ని నెలల నుంచి డ్రాగన్ దేశానికి వరుస షాకులు తగులుతున్నాయి. భవిష్యత్తులో చైనా దేశం ఒంటరి దేశం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కరోనా వైరస్ ఆ దేశంలోనే పుట్టింది. ఆ దేశం నుంచే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గినా ఇతర దేశాలు వైరస్ ధాటికి అతలాకుతలం అవుతున్న మాట వాస్తవం. కరోనా విషయంలో పలు దేశాలు ప్రత్యక్షంగానే చైనాపై ఆరోపణలు చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం కావడానికి... లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ భారీన పడి మరణించడానికి పరోక్షంగా చైనానే కారణం. కరోనా వైరస్ మాత్రమే కాక చైనాలో ఇతర వైరస్ లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డ్రాగన్ ప్రజల ఆహారపు అలవాట్లే వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి. చైనా కొత్త వైరస్ లకు సంబంధించిన తాజా సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తోంది. 
 
ఇలా వైరస్ ల వ్యాప్తికి కారణమైన చైనా తాజాగా కజఖిస్తాన్ ను ఆ దేశంలో వ్యాప్తి చెందుతున్న గుర్తు తెలియని వైరస్ గురించి ప్రశ్నిస్తోంది. కజఖిస్తాన్ లో జనవరి నెల నుంచి జులై నెల వరకు గుర్తు తెలియని న్యూమోనియా వైరస్ వల్ల 1,300 మంది మృతి చెందారు. దీంతో చైనా నుంచి కజిఖిస్తాన్ కు వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని డ్రాగన్ తమ దేశ ప్రజలకు సూచనలు చేసింది. అయితే చైనా ఓవరాక్షన్ కు కజిఖిస్తాన్ ఘాటు రియాక్షన్ ఇచ్చింది. 
 
చైనా నోరెత్తలేని విధంగా కజిఖిస్తాన్ కౌంటర్ ఇచ్చింది. వైరస్ ల గురించి చైనా చెప్పడం అసహ్యంగా ఉందని.... ముందు ఆ దేశంలో వ్యాప్తి చెందుతున్న వైరస్ లను అదుపు చేయాలని వ్యాఖ్యలు చేసింది. మా దేశంలో సహజంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ల గురించి అతిగా ప్రచారం చేసుకునే అలవాటును చైనా మానుకోవాలని సూచనలు చేసింది. కజఖిస్తాన్ కౌంటర్ గురించి చైనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: