కరోనా.. ఇప్పుడు ప్రపంచమంతా విజృంభిస్తున్న వ్యాధి ఇది. టెస్టు చేస్తే కానీ కరోనా ఉందో లేదో తెలియదు. అసలు మనకు కరోనా వచ్చిందో రాలేదో తెలియదు. ఒక వేళ వచ్చి పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు చాలా మందికి కనీసం సింప్టమ్స్ కూడా రావడం లేదు. మరి మనకు కరోనా వస్తే ఎలా గుర్తించాలి.?


ఇప్పుడు ఇది చాలామందికి ఓ సమస్యగా మారింది. కరోనా లక్షణాలు సాధారణంగా 2 నుంచి 14 రోజుల గ్యాప్ లో ఓ మనిషిలో బయపడుతుంటాయి. వీటిలో.. పొడి దగ్గు అనేది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. శ్లేష్మం రాకుండా.. గొంతు దగ్గర కొంత ఇబ్బందిగా అనిపించి వచ్చే పొడిదగ్గు ఉన్నప్పుడు కరోనా పలకరించిందేమో అన్న అనుమానం రావాలి. 

 

IHG's multi-step strategy to tackle <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> spread in ...


ఆ తర్వాత మైల్డ్ సింప్టమ్స్ వస్తాయి.  చాలామందిలో కనిపించేవి నీరసం, జ్వరం. ఏదైనా పని చేయడానికి బద్దకించినట్టుగా అనిపిస్తూ నీరసంగా ఉండటం.. దాన్నుంచి కొంచెం ఒళ్లు నొప్పులు.. హెడేక్ వరకు వెళ్తుంది.  వీటితోపాటే.. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. ఈ జ్వరం పారాసిటామల్  వేసుకోగానే తగ్గి పోతుంది. ఐతే…3, 4 రోజులపాటు.. ఇలాగే కంటిన్యూయస్ గా టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గటం.. తర్వాత మళ్లీ వస్తూ ఉంటే అప్పుడు కరోనా వైరస్ గా అనుమానించవచ్చు.

 


వీటితో పాటే.. చాలా ముఖ్యమైన మరో 2 లక్షణాలు.. స్మెల్ పోవడం, టేస్ట్ తెలియకపోవడం. కరోనా తొలిదశలో గుర్తించేందుకు ఇదే కీలకం. డ్రై కఫ్, జ్వరం, నీరసం చాలామందిలో రెగ్యులర్ గా కనిపించేవే అయినా..  వీటికి జోడీగా మిగతా లక్షణాలు కలిసి కనిపించినప్పుడు కొంచెం జాగ్రత్తపడటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: