కరోనా రోగుల ట్రీట్ మెంట్ లో ప్రభుత్వ వైద్యులది చాలా కీలకమైన రోల్. అయితే ఇపుడా డాక్టర్లే  ఆందోళన బాట పట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఎపుడో ఇవ్వాల్సిన పీ ఆర్సీ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు గాంధీ డాక్టర్లంటే, ప్రగతి భవన్ కు రానివ్వటం లేదని అధికారులపై మండిపడుతున్నారు. వారం రోజుల్లోగా  పీఆర్సీ ఇవ్వకపోతే విధులు బహిష్కరించి పోరాటం చేస్తామంటున్నారు డాక్టర్లు.

 

ప్రభుత్వ టీచింగ్ కాలేజీల్లో పని చేస్తున్న డాక్టర్లకు ఉమ్మడి రాష్ట్రంలోనే యూజీసి స్కేల్ ఇస్తామని చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వ టీచర్లకు యూజీసి ప్రకారం జీతాలిస్తున్నారు.. అయితే టీచింగ్ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్, పీజీలకు క్లాసులు చెప్తారు. మరోపక్క రోగులకు ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఒక రకంగా ప్రొఫెసర్లపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. దాంతో విషయాన్ని గుర్తించి టీచింగ్ చేసే డాక్టర్లకు యూజీసి జీతాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2006 నుంచి టీచింగ్ డాక్టర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ పెండింగ్ లోనే ఉంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు డాక్టర్లు. 

 

తెలంగాణాలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. దాదాపు  6 వేల మంది టీచింగ్ డాక్టర్లున్నారు.. అయితే ఇపుడు పీఆర్సీ ఇచ్చినా 2006 నాటి నుంచి ఏరియల్స్ కూడా ఇవ్వాల్సి  ఉంటుంది.. అయితే తమ జీతాలు పీఆర్సితో పెరుగుతాయని ఆశపడ్తున్న డాక్టర్లకు ప్రతి యేటా నిరాశే ఎదురవుతుంది.. మంత్రి ఈటల ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకున్నాక, టీచింగ్ డాక్టర్ల పీఆర్సీ పై స్పందించారు.. టీచింగ్ డాక్టర్ల పీఆర్సి ఫైల్ ను కదిలించారు. దానిపై పూర్తిగా కసరత్తు చేసినట్లు సమాచారం. అయితే ఫైల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి  ఆమోదించాల్సి ఉంది.. అన్ని శాఖలను నుంచి ముఖ్యమంత్రి పేషికి డాక్టర్ల ఫైల్ వెళ్ళినా సీఎంఓ అధికారుల నిర్లక్ష్యంతో సిఎం ముందుకు ఫైల్ వెళ్ళటం లేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

 

ఇప్పటికే టీచింగ్ ఆస్పత్రుల్లో , ముఖ్యంగా కరోనా కు ట్రీట్ మెంట్ చేస్తున్న గాంధీ ఆస్పత్రిలోని అవుట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తున్నారు.. రేపోమాపో నాలగవ తరగతి ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలంటూ విధులు బహిష్కరించే పరిస్థితి ఉంది.. మరోపక్క టీచింగ్ డాక్టర్లు పీఆర్సీ కోసం ఆందోళనకు సిద్దం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: