అంతా బాగుంది అనుకుంటున్నా, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనే అనుమానం మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఉంది. అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యే విధంగా, అన్ని జాగ్రత్తలు తీసుకుని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఓ ప్రధాన సామాజిక వర్గం తమపై, తమ ప్రభుత్వ  వైఖరిపై గుర్రుగా ఉంది అనే సమాచారం జగన్ కు రిపోర్టు ల రూపంలో అందాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్నిటార్గెట్ చేసుకుంటూ, జగన్, ఆ పార్టీ నాయకులు ముందుకు వెళ్లడం, చివరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొడాలి నాని సైతం, అదే సామాజిక వర్గం నాయకులను, అధికారులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం అన్ని ఆ సామజిక వర్గం వారికి ఆగ్రహం కలిగిస్తున్నాయట. 

IHG

 

 ఇక రాజధానిని అమరావతి నుంచి తరలించే ఏర్పాట్లు చేయడం, కీలక పదవుల్లో ఉన్న మాజీ నిఘా విభాగం అధికారి ఏబీ వెంకటేశ్వరరావు , ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్, ఇంకా కీలక స్థానాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులను టార్గెట్ చేసుకుంటూ, వారికి పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టులు కేటాయించారనే విమర్శలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంది.ఈ వ్యతిరేకత బాగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుండడంతో, ఆ సామాజిక వర్గానికి దగ్గర అవ్వాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. 

IHG


ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే  మంత్రిమండలిలో చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ వీర విధేయుడు,  తనకు అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ గా నియమించి, మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే  ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టి, అందులో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు ఇస్తే ఆ వర్గం నుంచి సానుకూలత ఏర్పడుతుందనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు ఆ పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న చర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: