చైనా ప్రస్తుతం విస్తరణ వాదంతో ముందుకు వెళ్తుంది అన్నది  ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంపై ఆధిపత్యం సాధించేందుకు గత కొంత కాలంగా ఎన్నో ఎత్తులు వేస్తోంది చైనా. ఈ క్రమంలోనే భారత్ కు సన్నిహితంగా ఉన్న నేపాల్ ను  తమ అధీనంలోకి తెచ్చుకోవడం...లాంటివి చేస్తుంది. అదే సమయంలో భారత్ ఎక్కడికక్కడ చైనా వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ప్రతి వ్యూహాలు పన్నుతోంది. ప్రస్తుతం భారత్ ఓవైపు సరిహద్దుల్లో,  మరోవైపు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా దేశాలతో కలిసి విన్యాసాలు... ఇలా చైనాకు చెక్ పెట్టేందుకు ఎన్నో ఎత్తులు వేస్తోంది..... 

 


 అయితే ప్రస్తుతం భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో  తమ ఆధిపత్యం సాధించడానికి చైనా ఎలా అయితే  వ్యూహాలు పన్నుతోందో .. చైనాకు అవతల ఉన్న తైవాన్  ఫిలిప్పీన్స్ వియత్నాం లాంటి దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తూ  చైనా విస్తరణ వాదానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ వియత్నం తైవాన్ లాంటి దేశాలు కూడా భారత్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తైవాన్ చైనా కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసింది భారత్. విదేశాంగ విధానంలో అద్భుతంగా పనిచేసేటువంటి సత్తా ఉన్న గౌరంగలాల్ దాస్ ను  ప్రస్తుతం తైవాన్  కు రాయబారిగా పంపించింది భారత్. అయితే భారత్ రాయభారి ని  పంపడం వెనక పెద్ద వ్యూహమే ఉంది అని టాక్ వినిపిస్తుంది.

 

 ఇలా భారత్... చైనా విస్తరణ విధానానికి చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహంతోనే విదేశాంగ విధానంలో ఎంతగానో సమర్థుడైన వ్యక్తిని రాయబారిగా  పంపించింది అనేది  ప్రస్తుతం ప్రపంచ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనా కి తైవాన్ కి మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారత్ ఒక రాయబారిని పంపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: