కరోనా  వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చి ప్రస్తుతం అక్కడ తగ్గి ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది, అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి వైరస్ విషయంలో ప్రస్తుతం ప్రపంచం మొత్తం చైనా మీద ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది కూడా. అయితే వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత చైనాలో ఓ వైరాలజిస్ట్  గురించి  ఆసక్తికర విషయం బయటకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. డాక్టర్ లీ అనే వ్యక్తి  వుహాన్ లో  ఉన్న మార్కెట్ నుంచి కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుంది అని ముందుగా గ్రహించి తన వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటే ఏకంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చైనా. 

 

 ఆ తర్వాత ఆ  డాక్టర్ కూడా కరోనా  వైరస్ సోకి చనిపోవడం.. ఆ తర్వాత ఈ ఘటనపై  స్పందించిన చైనా క్షమాపణలు చెప్పటం  ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే  తాజాగా ఇలాంటి పరిస్థితి మరో వైరాలజిస్ట్ కి  కూడా వచ్చినట్లు తెలుస్తోంది. హాంకాంగ్కు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మింగియన్ కరోనా వైరస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. హాంగ్కాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీలో వైరాలజీ ఇమ్యూనిటీ నాలెడ్జ్ విభాగంలో పరిశోధకురాలు గా పనిచేస్తున్న ఆమె.. కరోనా  వైరస్ గురించి పరిశోధనలు చేసిన తొలి శాస్త్రవేత్తల్లో ఒకరు. 

 


 అయితే బయట ప్రపంచానికి చెప్పే  మూడు నెలల ముందే  చైనాలో కరోనా వైరస్ ని గుర్తించామని... అయితే తనతో పాటు పనిచేసిన పరిశోధకులు ఈ వైరస్ గురించి బయటకు చెప్పడానికి ఎంతగానో భయపడిపోయారని..  అన్ని  తెలిసి కూడా  మహమ్మారి వైరస్ గురించి చైనా  దాచింది అంటూ ఆరోపణలు చేసింది ఆ పరిశోధకురాలు. ఈ విషయం ఎక్కడ బయటకి చెబితే తన   ప్రాణాలమీదికి వస్తుందో అన్న భయంతో ఏప్రిల్ నెలలో  నిఘా కెమెరాల నుంచి తప్పించుకుని దొంగచాటుగా అమెరికా వచ్చి ప్రస్తుతం రహస్యంగా ఉంటున్న అంటూ తెలిపింది  పరిశోధకురాలు. అయితే ప్రస్తుతం ఈ పరిశోధకురాలు చెప్పినా వివరాలు అమెరికాకు కలిసి వచ్చే అవకాశముంది. చైనా పై అమెరికా విచారణ చేసేందుకు తోడ్పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: